Take a fresh look at your lifestyle.

ఉల్లి ఎగుమతులకు కేంద్రం ‘నో ‘ మహారాష్ట్ర రైతుల మండిపాటు

దేశంలో మళ్ళీ ఉల్లి ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఎగుమతులపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. గతేడాది ఉల్లి సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్రం ముందు జాగ్రత్తల్లో భాగంగా ఉల్లి ఎగుమతిపై నిషేధం విధించింది.  ఈ నిషేధం తక్షణమే అమలులోకి వస్తుందని ప్రకటించింది.  తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఉల్లి ఎగుమతిపై నిషేధం కొనసాగుతుందని ప్రకటించింది.  గత కొన్ని రోజులుగా దేశంలో విస్తారంగా వర్షాలు కూరుతున్న నేపథ్యంలో దేశంలో ఉల్లిపంట దిగుబడి తగ్గిపోయింది.  డిమాండ్‌ ‌కు తగినంతగా ఉల్లి లేకపోవడంతో ధరలు క్రమంగా పెరుగుతున్నాయి.  గతేడాది ఉల్లి ధరలు ఇదే సమయంలో కేజీ 40 నుంచి వందకు పెరిగింది.  ఒకానొక దశలో ఉల్లి ధర ఏకంగా రూ.150కి చేరింది.  అటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు గాను కేంద్రం ఎగుమతులపై నిషేధం విధిస్తు నిర్ణయం తీసుకుంది.

ఉల్లిపాయల ఎగుమతిపై నిషేధం తక్షణం అములోకి వస్తుందన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటనపై మహారాష్ట్రలోని ఉల్లి రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉల్లి పంట మార్కెట్‌లోకి భారీగా వస్తున్నదని నాసిక్‌ ‌రైతులు చెప్పారు. ఎగుమతులపై తక్షణం నిషేధం విధించడం వల్ల ఉల్లిని ఎక్కడ నిల్వ చేయాలి, ఎక్కడ అమ్ముకోవాలని వారు ప్రశ్నించారు. ప్రస్తుతం కిలో ఉల్లి రూ.20-25కు అమ్ముడు పోతున్నదని, ఎగుమతులపై నిషేధం వల్ల ఈ ధర రూ.2-3కు పడిపోతుందని వాపోయారు. ఉల్లిని పండించే తమ లాంటి రైతులు బాగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎగుమతులపై నిషేధం వల్ల దళారులు లబ్దిపొందుతారని ఆరోపించారు. వారు తక్కువ ధరకు భారీగా ఉల్లిని కొని ఆ తర్వాత ఎక్కువ ధరకు అమ్ముకుంటారని చెప్పారు. ఎగుమతులపై నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వల్ల ఉల్లి రైతులకు నష్టం, దళారులకు లాభం చేకూరుతుందని నాసిక్‌ ఉల్లి రైతులు విమర్శించారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!