Take a fresh look at your lifestyle.

అనారోగ్యంతో సీనియర్‌ ‌పాత్రికేయులు మృతి

పాత్రికేయ వృత్తికి వన్నెతెచ్చిన
మహనీయుడు పోతుగంటి వెంకటేశ్వర్లు
గరిడేపల్లి, జులై 28(ప్రజాతంత్ర విలేకరి) : ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రభాత వార్త బ్యూరో గా సుదీర్ఘ కాలం సేవలందిస్తూ పాత్రికేయ వృత్తి లో తనకంటూ విశిష్ట స్థానం సంపాదించిన పోతుగంటి వెంకటేశ్వర్లు (44)బుధవారం అనారోగ్యంతో ఆకస్మికంగా మృతి చెందారు . కుటుంబ సభ్యులు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గరిడేపల్లి మండలం మంగాపురం గ్రామానికి చెందిన పోతు గంటి వెంకటేశ్వర్లు తీవ్రమైన ఊపిరితిత్తులకు సంబంధించిన శ్వాససంబంధ సమస్యలతో హుజూర్నగర్‌ ‌ప్రైవేట్‌ ‌హాస్పిటల్‌ ‌లో చికిత్స పొందారు మంగళవారం రాత్రి తీవ్రమైన శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్న ఆయనను అక్కడి వైద్యులు హైదరాబాద్‌ ఆస్పత్రికి తీసుకువెళ్ళమని సూచించారు కాగా మార్గమధ్యలో ఆయన ఆకస్మిక మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు మృతునికి భార్య కూతురు ఉన్నారు.

వెంకటేశ్వర్లు మృతి పట్ల ప్రెస్‌ ‌క్లబ్‌ ‌ప్రగాఢ సంతాపం :
పోతుగంటి వెంకటేశ్వర్లు ఆకస్మిక మరణం బాధాకరమని గరిడేపల్లి ప్రెస్‌ ‌క్లబ్‌ అధ్యక్షులు కొండ సైదులు గౌడ్‌ ,‌సీనియర్‌ ‌రిపోర్టర్‌ ‌ముచ్చర్ల గోపాలకృష్ణ ,మేకపోతుల వెంకటేశ్వర్లు, కోటి, లక్ష్మణ్‌ ‌పలువురు పాత్రికేయులు ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు. ఆయన మృతి పత్రికా రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. ప్రెస్‌ ‌క్లబ్‌ ‌ప్రధాన కార్యదర్శి కడారి వెంకటేశ్వర్లు ఉపాధ్యక్షులు రావుల వెంకన్న కార్యదర్శి వెంకటేష్‌ ‌చాగంటి వీరయ్య నరేష్‌ ‌జగదీష్‌ ‌జోషు సంతాపం తెలిపారు.

పాత్రికేయునికి నివాళులు….
అదేవిధంగా మాజీ జెడ్పిటిసి పెండెం శ్రీనివాస్‌ ‌గౌడ్‌ ‌పోతుగంటి వెంకటేశ్వర్లు భౌతిక కాయంపై పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియపరుస్తూ సంతాపం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మారుమూల గ్రామంలో పుట్టి పత్రిక రంగంలో కృషి పట్టుదల ఆత్మవిశ్వాసం అంకితభావం తో ఉమ్మడి నల్లగొండ జిల్లా వార్త పత్రికలో చెరగని ముద్ర వేసుకున్నాడని కొనియాడారు. ఎల్లావు ల వెంకటేశ్వర్లు పలువురు ప్రజాప్రతినిధులు సంతాపం తెలిపారు.

Leave a Reply