Take a fresh look at your lifestyle.

మహాకవి శ్రీ శ్రీ జయంతి వేడుకలు

రామన్నపేట, ఏప్రిల్‌30 (‌ప్రజాతంత్ర విలేకరి) మహాకవి శ్రీ శ్రీ 110వ జయంతి వేడుకలు రామన్నపేటలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రచయితల వేదిక సభ్యులు రాపోలు రాజశేఖర్‌ ‌మాట్లాడుతూ అభ్యుదయ భావాలతో రచనలు చేసి జనం గుండెల్లో నిలిచిన వైతాళికుడని, ఈ శతాబ్దం కవిగా శ్రీ శ్రీకి గౌరవం దక్కిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా శ్రీశ్రీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కామిశెట్టి శేఖర్‌, ‌తెల్లా ప్రసాద్‌, ‌సుబ్బారావు, ఉదయ్‌ ‌ప్రసాద్‌, అఖిల్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply