Take a fresh look at your lifestyle.

కెసిఆర్‌ హామీలు నీటి మీద రాతలే నా?’’

(నేడు మహాధర్నా సందర్భంగా)

– సత్యఫుల్లు, మహబూబాబాద్‌
‘‘‌పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్ళు తప్ప ‘‘అని శ్రీశ్రీ  అన్నట్లు పోరాడితే లభించేది ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం తప్ప అని జాక్టో, యుఎస్‌ ‌పిసి  ఖ••• లు భావించి విసిగి వేసారి పోరు బాట పట్టాయి.  సమస్యల పరిష్కారాన్ని పట్టించుకోలేదు.  ఉపాధ్యాయ సంఘాల నాయకులతో చర్చలకు సమయం కూడా ఇవ్వలేదు.  తెలంగాణ సాధనకు , తెరాస ప్రభుత్వం ఏర్పడడానికి ఉపాధ్యాయుల కృషి మరచిపోయారు. తెలంగాణ ఉద్యమంలో 42  రోజుల సకల జనుల సమ్మెలో క్రియాశీలక పాత్ర పోషించింది  ఉపాధ్యాయులే అని విస్మరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా  వేతనాలు అందిస్తామని వాగ్దానం చేసి  వారి పదవులకోసం తమను వాడుకుని  తీరా.. ఆరున్నరేళ్ళైనా  ఉపాధ్యాయ, ఉద్యోగులకు మొండిచెయ్యి చూపారని ఆ వర్గాలు వాపోతున్నాయి.
తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రభుత్వ విద్యను కాపాడుకోవాలని ఉపన్యాలిచ్చి , పేదవారు చదువుకునే పరిస్థితి లేకుండా చేసే ప్రైవేట్‌ ‌యూనివర్సిటీ ల బిల్లును• ఆమోదించడం ,ఆ యూనివర్సిటీలను పాలకవర్గాల అనుయాయులకు కట్టబెట్టడం వెనుక మతలబు ఏమిటో?…పాఠశాల విద్యలో అసమానతలు పెంచారని, ఆరోపించారు.ఉపాధ్యాయుల సమస్యలు  పరిష్కరి స్తామన్న హామీకి వ్యతిరేకంగా.. వ్యవహరించడంవలన, విద్యారంగం కుదేలయింది. కరోనా సంక్షోభ కాలంలో ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించక ఆర్థిక ఇబ్బందులతో పలువురు ఉపాధ్యాయులు ఆత్మహత్యలకు పాల్పడడం విదితమే.  కనీసం విదియా ప్రణాళిక తయారీలో ఉపాధ్యాయుల భాగస్వామ్యం చేయకుండా ఇష్టం వచ్చిన రీతిలో విద్యారంగాన్ని భ్రష్టు పట్టించే విధంగా నిర్ణయాలు ఉండటం బాధాకరం… 18 సమస్యలకు ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చి ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి, వాటి పరిష్కారానికి రాతపూర్వకంగా ఇచ్చి రెండు సంవత్సరాల ఏడు నెలల రెండు రోజులు అవుతున్నా వాటిని పరిష్కరించకపోవడం ప్రభుత్వ చిత్తశుద్ధితెలుపుతుంది.
బదిలీలు అంతర్‌ ‌జిల్లా బదిలీల హామీకి తిలోదకాలు ఇవ్వడమే.   కరోనా విపత్కర పరిస్థితుల్లో మార్చి 22 నుండి అన్ని విద్యాసంస్థలు మూసివేసి, ఉద్ధృతి తగ్గినా కూడా విద్యా సంస్థలను తెరవకుండా జాప్యం చేయడం విచారకరం. ఆన్లైన్‌ ‌విద్య ప్రవేశ పెట్టి చేతులు దులుపుకున్నారు. విద్యాబోధనకు ప్రత్యామ్నాయం కానేకాదు.  ప్రత్యక్ష బోధన ద్వారానే సృజనాత్మకత పెంపొందుతుందని ఇస్రో మాజీ చైర్మన్‌ ‌కస్తూరి రంగన్‌ అన్నట్లు ప్రత్యక్ష బోధనకు మించినది లేదు. టీవీ లకు కరెంటు ఉండదు, సిగ్నల్‌ ‌రాదు, రీఛార్జ్ అయిపోతుంది, ఇవన్నీ బాగుండి పాఠం వీక్షించేందుకు కూర్చుంటే ఆ పాఠం విద్యార్థులు చదివే మాధ్యమం లో కాకుండా వేరే  మాధ్యమంలో వస్తుంది. విద్యార్థులు గందర గోళంలో అయోమయంలో పడుతున్నారు. కోవిడ్‌ ‌నిబంధనలను అనుసరించి పాఠశాలలను తెరవాలి. విద్యా సంవత్సరాన్ని గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకోవాలి.  ప్రభుత్వ విద్యను, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించు కోవడానికి పోరు బాట పట్టారు.

- Advertisement -

అమితుమీ తేల్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నాయి.  డిసెంబర్‌ 8 ,9 ‌వ తేదీలలో భోజన విరామ సమయంలో నిరసనలు, డిసెంబర్‌ 17‌న జిల్లా కేంద్రాలలో సామూహిక నిరాహార దీక్షలు, డిసెంబర్‌ 29‌న రాష్ట్ర రాజధాని ధర్నాచౌక్లో  మహా ధర్నాకు పిలుపునిచ్చి, మొదటి ,రెండవ దశలో విజయవంతం చేశాయి.  రాజ్యాంగ బద్ధమైన డిమాండ్లను పరిష్కరించి, విద్యారంగంలో మౌలిక వసతులు కల్పించి  విజ్ఞతతో, విద్యారంగ అభివృద్ధికి సహకరిస్తే….. పాలకులకు,  ఉపాధ్యాయులకు ఇరువురికి శ్రేయస్కరం.

Leave a Reply