Take a fresh look at your lifestyle.

జనగణనకు ప్రత్యేక ట్రైబల్‌ ‌కాలం పునరుద్ధరించాలి

  • దిల్లీలో కదంతొక్కిన ఆదివాసీలు
  • ఆలిండియా ఆదివాసీల మహా ధర్నా

ప్రజాతంత్ర నెట్‌వర్క్: ఆదివాసీ, ఇండిజినెస్‌ ‌ధర్మ సమన్వయ కమిటీ, ఇండియా ఆధ్వర్యంలో అరవింద్‌ ఒరావ్‌ ‌నాయకత్వంలో భారత జనగణన పట్టికలో ఆదివాసీ జనగణనకు ప్రత్యేక ట్రైబల్‌ ‌కాలం పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేస్తూ న్యూ దిల్లీ జంతర్‌ ‌మంతర్‌లో ఆలిండియా ఆదివాసీల మహా ధర్నా ప్రదర్శన నిర్వహించారు.

Maha Dharna of All India Tribes

ఈ కార్యక్రమంలో సమన్వయ కర్త మడివి నెహ్రూ మాట్లాడుతూ ఈ దేశంలో జనగణన మొదలు పెట్టిన బ్రిటీషర్లు ఈ దేశ మూలవాసీల అస్తిత్వాన్ని గౌరవించి ప్రత్యేక కాలాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. స్వతంత్ర భారత దేశంలో 1951 జనగణనలో కూడా ప్రత్యేక కాలంలోనే చేపట్టారు. కానీ 1961 నుండి ట్రైబల్‌ ‌కాలం లేకుండా చేశారు. నాటి నుండి ఈ దేశ ములవాశీలం అదర్స్ ‌కాలంలో లేదా హిందూ జనాభాలో నమోదు చేయిస్తూ ఈ దేశంలో ఆదివాసీలు లేరని ప్రచారం చేస్తూ ఆదివాసీ ఉనికిని, అస్తిత్వాన్ని సమాధి చేశారు.

ఈ పరిస్థితి ఇకపై కొనసాగరాదని ఆదివాసీల ఉనికికి, ఆస్తిత్వానికి ఆధారమైన ప్రత్యేక జనగణన కాలం పునరుద్ధరించేదాక ఈ ఉద్యమం ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హేచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్‌, ‌బీహార్‌, ‌గుజరాత్‌, ఉత్తర్ప్రదేశ్‌, ‌ఝార్కండ్‌, ‌మధ్యప్రదేశ్‌, ‌మహారాష్ట్ర, ఒడిస్సా రాష్ట్రాల ప్రతినిధులు, ముఖ్య నాయకులు రాజ్‌కుమార్‌ ‌కుంజా, తెలంగాణ నుండి కొరంగే దౌలత్‌ ‌రావ్‌, ‌మంగాం విశ్వం రావ్‌, ‌నల్లమందల శ్రీనివాస్‌, ఉమ్మల దుర్గా రెడ్డి, పాయం రాజేష్‌, ఆం‌ధప్రదేశ్‌ ‌నుండి కారం దారయ్య, ఇర్ప సూర్య చందర్రావ్‌ ‌కుంజా శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply