Take a fresh look at your lifestyle.

రైతు ఉద్యమ విజయానికి మద్దతుగా .. నేడు హైదరాబాద్‌లో మహా ధర్నా..

  • హాజరు కానున్న రాకేష్‌ ‌తికాయత్‌ ‌మరియు ఇతర జాతీయ నాయకులు..
  • మహా ధర్నాను విజయవంతం చేద్దాం..తెలంగాణ విద్యావంతుల వేదిక పిలుపు

దేశ చరిత్రలో రైతాంగ ఉద్యమం అఖండ విజయం సాదించిన  నేపథ్యంలోనేడు  హైదరాబాద్‌ ఇం‌దిరా పార్కు వద్ద తెలంగాణ ఏ.ఐ.కే.ఎస్‌.‌సి.సి. అధ్వర్యంలో నిర్వహిస్తున్న మహా ధర్నా ను విజయవంతం చేయాలని ఏ.ఐ.కే.ఎస్‌.‌సి.సి భాగస్వామ్య సంస్థ తెలంగాణ విద్యావంతుల వేదిక  రాష్ట్ర అధ్యక్షులు అంబటి నాగయ్య రైతాంగానికి, ప్రజలకు విజ్ఞప్తి చేసారు.

ఇట్టి  ధర్నా లో రైతుల విజయానికి జేజేలు పలుకుతూనే, వారి చైతన్య స్పూర్తి ని ఎక్కిపడుతూ  కనీస మద్దతు ధరల గ్యారెంటీ చట్టం కొరకు,విద్యుత్‌ ‌సవరణ బిల్లులను ఉప సంహరించుకోవాలని,పోడు భూముల కు పట్టాలు ఇవ్వాలని,వరి ధాన్యం ను కోనుగోలు ను వేగవంతం చేయాలని డిమాండ్లు చేస్తూ..పోరాటాన్నికొనసాగించడానికి  ప్రతినబూనుదామని వారన్నారు.  ఈ ధర్నా కు  ఉత్తర ప్రదేశ్‌ ‌రైతు నాయకులు రాకేష్‌ ‌తికాయత్‌ ‌తో పాటు మరియు ఇతర జాతీయ స్థాయి  నాయకులు పాల్గొంటారన్నారు. జాతీయ స్థాయిలో సంయుక్త కిసాన్‌ ‌మోర్చా పోరాటం విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన రాకేష్‌ ‌తికాయత్‌ ‌ప్రసంగం వినడానికి, ధర్నా ను విజయవంతం చేయడానికి, రైతాంగ ఉద్యమం కొనసాగించడానికి మరింత స్ఫూర్తితో  ముంధుకు  కదలడానికి  పెద్ద ఎత్తున తరలి రావాలని జిల్లాల నుండి రైతులకు, రైతు సంఘాల కార్యకర్తలకు, హైదరాబాద్‌ ‌లో రైతు ఉద్యమంలో క్రియాశీల పాత్ర  పోషిస్తున్న ప్రజా సంఘాలు, పౌరులకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.

Leave a Reply