Take a fresh look at your lifestyle.

పత్రికలు ప్రజలకు దిక్సూచి: కాంగ్రెస్‌ ‌నేత గాలి

Magazines is compass for the public congress leader Gali
గురువారం పటాన్‌చెరులో ‘ప్రజాతంత్ర’-2020 క్యాలెండర్‌ను ఆవిష్కరిస్తున్న కాంగ్రెస్‌ ‌నేత గాలి అనిల్‌

పటాన్‌చెరు: పత్రికలు ప్రజలకు, ప్రజాప్రతినిధులకు వారధిగా పని చేస్తాయని,ప్రజాస్వామ్య పరిరక్షణలో పత్రికలే కీలకమని, కాంగ్రెస్‌ ‌పార్టీ రాష్ట్ర నాయకుడు, మెదక్‌ ‌పార్లమెంట్‌ ఇం‌ఛార్జి గాలి అనిల్‌ ‌కుమార్‌,‌పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్‌ ‌పార్టీ ఇంఛార్జి కాటా శ్రీనివాస్‌ ‌గౌడ్‌ అన్నారు. తెలంగాణ దినపత్రిక ‘ప్రజాతంత్ర’-2020 క్యాలెండర్‌ను గురువారం గాలి అనిల్‌ ‌కుమార్‌ ‌కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గాలి అనిల్‌ ‌కుమార్‌ ‌మాట్లాడుతూ… నిజాన్ని నిర్భయంగా రాసే ప్రజాతంత్ర అంటూ అభినందనలు తెలిపారు. మీడియా రంగం చాలా కీలకంగా ఉధృతంగా విస్తరిస్తుందనీ, పత్రికకు సాంకేతికను అందిపుచ్చుకుని మరింత సందేశాత్మక రీతిలో ఉపయోగపడాలన్నారు. పత్రికకు ప్రజాస్వామ్యానికి నిదర్శనం అని ఆయన అన్నారు. ప్రజాతంత్ర దినపత్రిక అనునిత్యం ప్రజల సమస్యలపై ప్రభుత్వాలకు జన స్వరం వినిపిస్తుందనీ అనిల్‌ అన్నారు. క్యాలెండర్‌ ఆవిష్కరణలో కాంగ్రెస్‌ ‌నాయకులు దుద్యాల రవీందర్‌, ‌సుధాకర్‌ ‌యాదవ్‌, ‌మల్లేష్‌, ‌చింటూ, ప్రజాతంత్ర పటాన్‌చెరు విలేఖరి ఎం. రాజు తదితరులు పాల్గొన్నారు.

Tags: prajatantra 2020 calendar launch, congress leader gaali anil, kaata srinivas

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply