గ్లోబల్‌ సమ్మిట్‌లో పాల్గొనండి

– మధ్యప్రదేశ్‌ సీఎంకు మంత్రి తుమ్మల ఆహ్వానం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 6: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి మోమన్‌ యాదవ్‌తో శనివారం భేటీ అయ్యారు. ఈనెల 8, 9వ తేదీల్లో హైదరాబాద్‌లోని భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌లో పాల్గొనాల్సిందిగా ఆయనను ఆహ్వానించారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర మంత్రులకు ఒక్కో రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రముఖులను సమ్మిట్‌కు ఆహ్వానించే బాధ్యతను అప్పగించిన విషయం విదితమే. ఈ క్రమంలో ఈరోజు మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిని ఆహ్వానించడానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మధ్యప్రదేశ్‌ వెళ్లారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *