Take a fresh look at your lifestyle.

వలస కార్మికులను భోజనాలు

సూర్యాపేట, మే 18, ప్రజాతంత్ర ప్రతినిధి):కరోనా వైరస్‌ ‌నేపధ్యంలో విధించిన లాక్‌డౌన్‌లో కొన్ని సడలింపులు ఇవ్వడంతో గత కొన్ని రోజులుగా ఎలాంటి ఉపాధి లేక తమ సొంత ప్రాంతాలకు వెళ్తున్న వలస కార్మికులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం ఎన్‌హెచ్‌65 ‌జాతీయ రహదారిపై భోజనం ఏర్పాటుచేయడం జరిగిందని మున్సిపల్‌ ‌చైర్‌పర్సన్‌ ‌పెరుమాళ్ళ అన్నపూర్ణ తెలిపారు.

ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారని, తద్వారానే కరోనా తగ్గుముఖం పట్టిందని తెలిపారు. రాష్ట్ర విద్యుత్‌ ‌శాఖ మంత్రి జిల్లాలో విస్రృత పర్యటనలు చేసి, అధికారలు, వైద్యులను సమన్వయ పరిచి కరోనాను పూర్తిగా తరిమేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ ‌వైస్‌ ‌చైర్మన్‌ ‌పుట్ట కిషోర్‌, ‌వార్డు కౌన్సిలర్లు రేణుక, హనుమంతరావు, సారగండ్ల శ్రీను, వెంకట రామయ్య, గౌస్‌ ఉద్దీన్‌, ‌ప్రసాద్‌, ‌సమ్మిపాల్గొన్నారు.

Leave a Reply