Take a fresh look at your lifestyle.

వెలుగులీనుతున్న వైజ్ఞానిక మానవత

అభివృద్ధి పేరుతో దురాశతో, లాభార్జన ధ్యేయంతో వనాలను ధ్యంసం చేస్తున్నప్పుడు, విచక్షణ లేకుండా ఖనిజాల కోసం గనులను తవ్వుతున్నప్పుడు వన్యప్రాణులు నిరాశ్రయులై మానవ ఆవాసాలకు రావడం, వాటిని వేటాడి ఆహారంగా తీసుకోవడం వలన మానవ జాతి ముప్పులో పడిపోతున్నదనే సత్యాల నిర్ధారణకు లోనయ్యారు. ఒక జీవి తన సహజ ప్రాంతంలో ఉన్నప్పుడు ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావు. కానీ ఎప్పుడైతే తన సహజ ఆవాసం నుండి భిన్నమైన శీతోష్ణస్థితులు గల ఆవాసంలోకి వచ్చినప్పుడు దాని ఆహార గొలుసులో దానిని నియంత్రించే సహజ శత్రువు లేని కారణంగా ఆ జీవి తన సంతానాన్ని విస్ఫోటక పద్దతిలో వృద్ది చేసుకుంటుంది.

‘‘సామాన్య ప్రజల కంటె ఎక్కువగా మేధావులైన వారిలో, వైజ్ఞానిక శాస్త్రాలలో, తత్వశాస్త్రాలలో, కళలో పెద్ద పట్టాలు పుచుకున్నవారిలో చదువులకు వారి నమ్మకాలకు ఏమి సంబంధం ఉండడం లేదు. వారు మూఢత్వ మానసిక పంజరాల నుండి బయటపడకపోతే ఇండియా స్వతంత్రదేశమైనా ఆధునిక దేశం కొబోదు’’ 1961 జబల్పూర్‌ ‌నగరంలో జరిగిన విద్యా కార్యక్రమంలో ప్రసంగించిన అప్పటి ప్రధాని నెహ్రూ చేసిన వాఖ్యలివి. వైజ్ఞానిక దృక్పథం వలన అనేక మానవ విజయాలు నమోదు అయ్యాయని, ప్రజా మౌఢ్యాల పరిపోషణనే వృత్తిగా చేసుకున్న అన్ని సమూహాల ప్రచారకులను టార్గెట్‌ ‌చేస్తూ జ్యోతిష్యం శాస్త్రము కాదని, అంతటి గొప్ప గ్రహాలకు మనవంటి అల్పజీవులపై విశేషమైన ఆసక్తి దేనికి అని ఎద్దేవా చేసాడు. అజ్ఞానానికి-విజ్ఞానానికి, మౌఢ్యానికి-శాస్త్రీయ దృక్పథానికి మధ్య నమ్మకాలు, విశ్వాసాలతో కూడిన మతం కక్ష్యలా ఏర్పడింది. ఈ కక్ష్యను ఛేదించుకుని శాస్త్రీయ పుంతల వెలుగు మానవ సమాజంపై ప్రసారం కావడానికి అనేక కారణాలు, పరిస్థితులు సంప్రదాయాలు అవరోధంగా నిలుస్తున్నాయి.

ప్రస్తుతం ప్రపంచము కొరోనా మహమ్మారి గుప్పిట్లో పడి సతమతవుతున్నది. ఈ విపత్తు ఫలితాలు భవిష్యత్‌లో ఎలా ఉండబోతాయో, కలిగే పరిణామాల పట్ల స్పష్టత లేదు. ఈ మహమ్మారిపై సహజంగానే సమాజంలో సమూహాలు పలురకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు. కోవిడ్‌-19 ‌సంక్రమణ ఒక జాతికి, ఒక ఖండానికి పరిమితం గాకుండా ప్రపంచమంత వ్యాపించడం దైవశాపంగా ఆస్థికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దేవుడికి, విశ్వాసులకు దూతలుగా ప్రకటించుకున్న ప్రవక్తలు, బోధకులు తమ ప్రార్థనల ద్వారా మహమ్మారిని తొలగిస్తామని చెప్పి దాని వ్యాప్తికి మరింత దోహదపడిన ఉదంతాలు అనేక దేశాలలో సంభవించాయి. కొంతమంది బాబాలు గ్రహ చలనాలు గాడి తప్పడం వల్ల వైరస్‌ ‌వ్యాప్తి చెందుతుందని, అవి సరైన కక్ష్యలోకి చేరినపుడు వ్యాప్తి తగ్గుతుందని ప్రకటిస్తున్నారు. ప్రపంచంలోని పలు దేశాల పాలకుల వ్యక్తిగత విశ్వాసాలు ఏమైనప్పటికి, అలాగే మత రాజ్యాలుగా ప్రకటించుకున్న దేశాధినేతలు కూడ మత సంబంధ, దైవ ప్రార్థనలపై ఆంక్షలను, నిషేధం విధించారు. జంతువుల నుండి వైరస్‌ ‌సంక్రమణ జరుగుతుంది అని రూఢి అయ్యాక ప్రకృతి ప్రేమికులు, శాఖాహార ప్రచారకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక మాంసం కొరకు జంతు, పక్షి వేట వధ జరగదని సమస్త ప్రాణులు, వనాలతో కల్సిమెల్సి జీవించే కమనీయ దృశ్యం ప్రకృతిలో ఆవిష్కరిస్తుందని సంబుర పడుతున్నారు.

- Advertisement -

కొరోనా కలిగించిన కల్లోలంతో విశ్వాసాలకు అతీతంగా పర్యావరణ, వైజ్ఞానిక అంశాలను తెల్సుకోవడానికి సాధారణ ప్రజలు, విద్యావంతులు, కవులు, రచయితలు తీవ్రమైన ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. వన్యప్రాణులు వైరస్‌లకు రిజర్వాయర్‌గా పని చేస్తాయి. అభివృద్ధి పేరుతో దురాశతో, లాభార్జన ధ్యేయంతో వనాలను ధ్యంసం చేస్తున్నప్పుడు, విచక్షణ లేకుండా ఖనిజాల కోసం గనులను తవ్వుతున్నప్పుడు వన్యప్రాణులు నిరాశ్రయులై మానవ ఆవాసాలకు రావడం, వాటిని వేటాడి ఆహారంగా తీసుకోవడం వలన మానవ జాతి ముప్పులో పడిపోతున్నదనే సత్యాల నిర్ధారణకు లోనయ్యారు. ఒక జీవి తన సహజ ప్రాంతంలో ఉన్నప్పుడు ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావు. కానీ ఎప్పుడైతే తన సహజ ఆవాసం నుండి భిన్నమైన శీతోష్ణస్థితులు గల ఆవాసంలోకి వచ్చినప్పుడు దాని ఆహార గొలుసులో దానిని నియంత్రించే సహజ శత్రువు లేని కారణంగా ఆ జీవి తన సంతానాన్ని విస్ఫోటక పద్దతిలో వృద్ది చేసుకుంటుంది. ఇంత వరకు కొరోనా వాహక జీవి ఏమిటో ఇంకా శాస్త్రవేత్తలు ఒక నిర్ధారణకు రాలేదు. వాహక జీవిలో కొవిడ్‌-19‌ని బలహీనం చేసే ప్రతి రక్షకులు సరిగ్గా పని చేయని కారణంగా అవి మానవునిలో ప్రవేశించినప్పుడు అతి క్రూరంగా అవయవ వ్యవస్థలను విచ్ఛిన్నం చేస్తున్నాయి. కొరోనా ఆకస్మాత్తుగా వ్యాపించడంతో అరికట్టే విధానాల్లో భాగంగా షట్‌డౌన్‌లు, లాక్‌డౌన్‌లు విధించడం వలన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కనీవిని ఎరగని రీతిలో అతలాకుతులం అవుతున్నది. ఇదే సందర్భంలో ఇందూలు మండడము వలన, కర్మాగారాల నుండి వెలువడే నత్రజని, కార్బన, సల్ఫర్‌ ఉద్గారాలు, కాలుష్యకాలు తగ్గడం వలన ఉష్ణోగ్రతలు తగ్గడం, వాతావరణ శుభ్రత వంటి ఆరోగ్య అనుకూల ఫలితాలను ప్రజలు అనుభవంలో తెల్సుకుంటున్నారు. ఎలాంటి మూఢత్వాలను అనుసరించడం లేదు.

వైరస్‌ ‌సంక్రమణకు లోనుకాకుండా మాస్క్‌లు, సానిటైజర్‌లు, వ్యక్తిగత రక్షణ కవచాలు వాడుతున్నారు. వైరస్‌ ‌జన్యుక్రమ నిర్ధారణ, వాక్సిన్‌ ఆవిష్కరణ, ఇమ్యూనిటీ, హెర్డ్ ఇమ్యూనిటి, వైరస్‌ ‌గొలుసు తెగిపోవడం వంటి భవనాలు, దత్తాంశాల పట్ల అవగాహనను పెంచుకుంటున్నారు. కర్వ్ ‌ఫ్లాటిన్‌ ‌కావాలని చూస్తున్నారు. కొరోనా విపత్తు బాధిత ప్రజలు అగ్ర రాజ్యాల్లోను, అభివృద్ధి చెందుతున్న దేశాలలో తమ నిరసనను, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మూడవ ప్రపంచ దేశాలన్నీ తమ బడ్జెట్‌లో 20 నుండి 30 శాతం రక్షణ రంగానికి కేటాయిస్తూ విద్య, వైద్య రంగాలను నిర్లక్ష్యం చేస్తూ వచ్చాయి. సంక్షేమ రాజ్య భావనను విస్మరిస్తూ, పెట్టుబడి సానుకూల విధానాలను అమలు చేస్తూ, ఆయుధాల ఉత్పత్తి, వ్యాపారంపై ఆధారపడిన అగ్రరాజ్యాలకు విధేయంగా ఉంటూ కొనసాగుతున్నాయి. అమెరికా, ఫ్రాన్స్, ఇ•లీ, జర్యని, స్పెయిన్‌ ఆయుధ వ్యాపారాల్లో అగ్రస్థానాల్లో ఉన్న ధనవంత దేశాలు కాని ప్రజారోగ్య వ్యవస్థ లేని కారణంగా, బీమా ఆధారిత ఆరోగ్య వ్యవస్థతో తీవ్రమైన ప్రాణనష్టాన్ని చవిచూసాయి. అలాగే ప్రపంచీకరణ కారణంగా ముడిసరుకులు ఒక దగ్గర, ప్రాసెసింగ్‌ ‌మరొక దేశంలో, అంతిమంగా ఔషదాల తయారీ మరొక దేశంలో ఉండే గొలుసు వ్యవస్థను బహుళజాతి కంపెనీలు ఏర్పాటు చేసుకున్నాయి. పేద దేశాలు ప్రపంచీకరణ, సరళీకరణ ఫలితంగా వైద్య పరికరాలు, టెస్టింగ్‌ ‌కిట్స్, ఔషధాల తయారీలో స్వయం సమృద్ధి, స్వావలంబన స్థితి లేకుండా చేసింది. సోషలిస్టు దేశాల మాదిరిగా మానవీయ ఆధారిత ప్రజారోగ్య వ్యవస్థను ప్రజలు డిమాండ్‌ ‌చేస్తున్నారు. ప్రైవేట్‌ ‌రంగంపై ఆధారపడిన ఆర్థికాభివృద్ధి ప్రకృతిని, మానవ జీవనంను విధ్యంసం, విస్ఫోటనం చేస్తుందని రూడీ చేసుకున్నారు. కొరోనా నివారణకు వాక్సిన్‌ ‌కనుగొనేవరకు భౌతిక దూరం, శుచి శుభ్రత అనే సామాజిక వాక్సిన్‌లతో నియంత్రించుకోవాలి. మహమ్మారి అదుపులోకి వచ్చాక మానవజాతి పర్యావరణ సానుకూల పద్దతులను నిత్యజీవితంలో ఆచరించాలి. ప్రకృతితో సామరస్యతను కొనసాగించే శాస్త్ర సాంకేతికరంగాలను మానవ సమాజ ప్రగతికి ఉపయోగించాలి. మూఢ్యం, చాందసాలు వ్యవస్థీ కృతమైన సమాజాన్ని విజ్ఞానం ద్వారా మార్చాలి. సమాజ సమిష్టి సంపద విజ్ఞానాన్ని ఇంటింటికి పంచాలి. కొరోనా కాలంలో మొగ్గ తొడుగుతున్న వైజ్ఞానిక వైఖరులు కొరోనా అనంతర కాలంలో వికసిస్తూ, మానవతావాద శాస్త్రీయ భావ ఉషస్సులతో సమ సమాజ ప్రపంచం ఉదయించాలి.

apnala srinivas
అస్నాల శ్రీనివాస్‌
9652275560

Leave a Reply