- ఒకే దెబ్బకు రెండు పిట్టలు.
- మరో సంఘం విస్తరణకు బ్రేకులు.
- సఖ్యత కోసమే ‘కెంగర్ల’ రంగ ప్రవేశం..
- యూనియన్ భాద్యతలు అప్పగించే అవకాశం..???
ప్రజాతంత్ర, గోదావరిఖని జూలై 7 : టీఆర్ఎస్- తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అగ్ర నాయకత్వం దూరదృష్టితో ఆలోచిస్తూన్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. సింగరేణి కోల్ బెల్ట్ విస్తరించి ఉన్న ఆరు జిల్లాలలో టిబిజికేఎస్ ఉనికికి భంగం కలగకుండా ఉండేందుకు దూరదృష్టితో ఆలోచించి పక్కాగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు . వాదోపవాదాలు వస్తున్నాయి. టిబిజికేఎస్ వల్ల టీఆర్ఎస్ పార్టీకి లాబం జరగాలని కోల్ బెల్ట్ ప్రాంత సీనియర్ ప్తజా ప్రతినిధులు సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తుంది. అందు కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు కనిపిస్తుంది. అందులో భాగంగానే సీనియర్ కార్మిక నాయకుడు కెంగర్ల మల్లయ్యను తిరిగి పార్టీలోకి ఆహ్వానించినట్లు కనిపిస్తుంది. అదేవిధంగా యూనియన్ భాద్యతలు అప్ప గించే అవకాశాలు ఉన్నట్టు పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
మరో సంఘం విస్తరించకుండా బ్రేక్
సింగరేణి కోల్ బెల్ట్ ఏరియాలో మరో కార్మిక సంఘం విస్తరించ కుండ నిరోధించడానికి పకడ్బందీగా వ్యూహాన్ని రచించారు. తెలంగాణ ఉద్యమకారుడు, టీఆర్ఎస్ కు అనుబంధంగా ఒక కార్మిక సంఘం ఉండాలని గట్టిగా వాదించిన వరసలో ప్రముఖులు కెంగర్ల మల్లయ్య ఒకరు. అలాంటి మల్లయ్య కోల్ బెల్ట్ ఏరియాలో టిబిజికేఎస్ ఏర్పాటు చేసి సనేక సంవత్సరాల కాలం నాయకత్వం భాద్యతలు నిర్వహించిన కెంగర్ల ను తిరిగి ఆహ్వానించాలని చర్చించిన వారిలో ఈ ప్రాంత ప్రముఖులు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెల్సంది. పార్టీలో జరిగిన పరిణామాల వల్ల బయటకు పోయిన మల్లయ్య ను సహ్వానించడమే ప్రత్యామ్నాయ మార్గమని భావించారు. టిబిజికేఎస్ నుండి బయటకు వెల్లి జాతీయ కార్మిక సంఘం అయిన బిఎంఎస్ లాంటి సంఘ భాద్యతలు చేపట్టి ఆ సంఘాన్ని కూడా కోల్ బెల్ట్ ఏరియా మొత్తం ఒక చుట్టు చుట్టి కార్యకర్తలను సమీకరించి క్షేత్ర స్థాయి నుండి రీజినల్ స్థాయి కమిటీలు రూపొందించి బిఎంఎస్ ను ఒక బలమైన శక్తిగా మరలిస్తుంటె టిబిజికేఎస్ నాయకులు ఈ ఆలొచనలోకి అనివార్యంగా ఆలోచించాల్సి వచ్చింది…
నాయకత్వ బాధ్యతలు అప్పగించి సంఘాన్ని సఖ్యతకు తేవాలని స్కెచ్…??? :- అస్తవ్యస్తంగా ఉన్న సంఘాన్ని అన్ని రకాల సరిదిద్దాలని నాయకత్వం యాచించి నట్లు కనిపిస్తుంది. టిబిజికేఎస్ కేంద్ర కార్యాలయం గోదావరిఖని ప్రధాన చౌరస్తా సమీపంలో ఉంటుంది. అయితే ఈ కార్యాలయం ఎరోజు తెరిచిన పాపానపోలే ఎందుకొ టిబిజికేఎస్ కార్యాలయం ఏదొ సందర్భంలో అధ్యక్షుడు వస్తుడంటే ఆ గంట సేపు యూనియన్ కార్యాలయం తలుపులు తెరుచుకుని ఉంటాయి. ఇక తర్వాత సంఘం కార్యాలయం తలుపులకు తాలం పడుతుంది. ఇది కేంద్ర కార్యాలయం పరిస్థితి. ఇక రీజనల్ స్థాయి, డివిజన్ స్థాయి కార్యాలయాల పరిస్థితి ఎలా వుంటుందో మనం ఊహించవచ్చు. కార్యాలయాలు ఇలా ఉంటే నాయకులు, కార్యకర్తలు ఏస్తాయిలో ఉంటుందనే విషయం మనకు అవగతమవుతుంది. ఈ పరిణామాల పలితమే నాయకత్వం మారాలనే ఆలోచనలు ఉద్భవిస్తున్నావనుకోవచ్చు..