మున్సిపల్‌శాఖ కీలక నిర్ణయం
మార్పుకనిపించేలా అభివృద్ధ్ది జరగాలి
అధికారులకు మంత్రి కెటిఆర్ ఆదేశం
రాష్ట్రంలోని పలు ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ఎల్ఆర్ఎస్కు ప్రభుత్వం మరోమారు అనుమతి తెలిపింది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల్లో ప్రత్యేక ఎల్ఆర్ఎస్ మేళాల నిర్వహణకు పురపాలకశాఖ నిర్ణయం తీసుకుంది. కొత్త
మున్సిపాలిటీలు, విలీనమైన గ్రామాలకు మాత్రమే ఈ ఎల్ఆర్ఎస్ వర్తించనుంది. ఎల్ఆర్ఎస్ అవకాశంపై విస్తృతంగా ప్రచారం చేయాలని మంత్రి కేటీఆర్ ప్రజాప్రతినిధులను, అధికారులను ఆదేశించారు. కొత్త మున్సిపాలిటీల్లో సెప్టెంబర్ వరకు ఎల్ఆర్ఎస్ గడువును పొడిగించింది. 43 కొత్త మున్సిపాలిటీల్లో ఎల్ఆర్ఎస్కు అవకాశం కల్పించింది. మహబూబ్‌నగర్, గద్వాల, నారాయణపేట మున్సిపాలిటీలపై నగరంలోని ఎంసీహెచ్ఆర్డీలో మంత్రి కేటీఆర్ నేడు సక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మార్పు కనిపించేలా మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. రోడ్లు, పచ్చదనం, శ్మశానవాటికల నిర్మాణంపై దృష్టి సారించాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ద్యానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో మెజార్టీ జనాభా పట్టణాల్లో ఉండే అవకాశం ఉన్నందున.. పట్టణాలను, ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. పౌర సేవలే కేంద్రంగా నూతన పురపాలక చట్టాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ చట్టంలోని విధులు కచ్చితంగా పాటించేలా అధికారులు పనిచేయాలన్నారు.