Take a fresh look at your lifestyle.

ఎల్‌ఆర్‌ఎస్‌ ‌జీవో131ను రద్దు చేయాలి

నాగర్‌ ‌కర్నూల్‌,‌సెప్టెంబర్‌ 10.‌ప్రజాతంత్రవిలేకరి:  ఎస్‌ ‌జీవో131ను రద్దు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు డాక్టర్‌ ‌కాళ్ళ నిరంజన్‌ ‌డిమాండ్‌ ‌చేశారు.గురువారం నాగర్‌కర్నూల్‌ ‌జిల్లా కేంద్రంలో మున్సిపాలిటీ కమిషనర్‌కు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి పాలమూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్‌ ‌కాళ్ల నిరంజన్‌ ఆధ్వర్యంలో ఎల్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేయాలని మునిసిపల్‌ ‌కమిషనర్‌ ‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సంందర్భంగా కాళ్ళనిరంజన్‌ ‌మాట్లాడుతూ  కరోనా సునామీ సృష్టిస్తున్న తరుణంలో గత తొమ్మిది నెలలుగా పేద మధ్యతరగతి ప్రజలు జీవన్మరణ పోరాటం చేస్తున్న  ఈ స్థితిలో కరోనా వ్యాధి సోకి హాస్పిటల్‌ ‌కు లక్షలు తగలేస్తున్న సమ యంలో ప్రభుత్వం ఇలాంటి జీవోలు తెచ్చి పేద ప్రజల పైన పెను భారం మోపడం దుర్మార్గల మైనచర్య అని  డాక్టర్‌  ‌కాళ్ల నిరంజన్‌ ‌ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

జిల్లా కన్వీనర్‌ ‌రవీందర్‌ ‌గౌడ్‌ ‌మాట్లాడుతూ దాదాపు లక్షల మందికి రాష్ట్రంలో ఉద్యోగాలు లేకపోవడంతో కుటుంబ పోషణ కోసం రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్లుగా మారి వారి కుటుంబాన్ని కొద్ది  గొప్ప పోషించుకుంటూ బ్రతుకుతున్న ఈ తరుణంలో రాష్ట్ర ప్రజలపై  ప్రత్యక్షంగా పరోక్షంగా  ప్రభావం చూపించే జీవో నెంబర్‌ 131 ‌చేసి రద్దు చేసి యథాతథంగా రిజిస్ట్రేషన్లు జరిపించాలని రవీందర్‌ ‌గౌడ్‌ ‌ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు. పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని 500 గజాల వరకు ఎల్‌ఆర్‌ఎస్‌ను క్రమబద్ధీకరణ చేసి ఉచితంగా చేయాలని డిమాండ్‌ ‌చేశారు. పేద మధ్యతరగతి వారికి రాజ్యాంగ హక్కు ప్రకారం సంక్షేమ కోణంలో మినహాయింపుకై పేద మధ్యతరగతి వారి భూములు మరియు భూములపై చేసుకునే స్వేచ్ఛ సంపాదన ప్రాథమిక హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వం తీసుకున్న చర్యలు మానుకోవాలని నాగర్కర్నూల్‌ ‌జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యవర్గం ముక్తకంఠంతో డిమాండ్‌ ‌చేశారు.రద్దు చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన ఆందోళన కార్యక్రమాలు చేపడతామని జిల్లా కలెక్టరేట్‌ ‌ముట్టడి చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పాలమూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్‌ ‌కాళ్ళ నిరంజన్‌ ‌జిల్లా కన్వీనర్‌, ఏం, ‌రవీందర్‌ ‌గౌడ్‌ ‌జిల్లా ప్రధాన కార్యదర్శి మూలింటి వెంకటేశ్వర్లు జిల్లా వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కుంభం మల్లేష్‌ ‌గౌడ్‌, ‌యువసేన అధ్యక్షులు లక్ష్మయ్య, ఉపాధ్యక్షులు సుధాకర్‌ ‌గౌడ్‌, ‌బీసీసేన ప్రధానకార్యదర్శి గంగోజి , లక్ష్మణాచారి, కే శంకర్‌, ‌రాజు, అరుణ్‌ ‌కుమార్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply