సూర్యాపేట, సెప్టెం బర్ 15, ప్రజా తంత్ర ప్రతి నిధి): తెలం గాణ రాష్ట్ర ప్రభు త్వం తీసు కున్న ఎల్ఆర్ఎస్, బిఆర్ఎస్ జీఓ 131ను తక్షణమే రద్దు చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల శ్రీనివాస్‌రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం భారత్ కమ్యూనిస్టు పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కోదాడ మున్సిపాలిటీ ముందు నిరసన వ్యక్తం చేసి మున్సిపల్ కమిషనర్ మల్లారెడ్డికి మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు రాష్ట్ర ప్రభుత్వం తమ ఖజానాన్ని నింపుకోడానికి జీఓలు తెచ్చి పేద ప్రజల నడ్డి విరిచే విధంగా 14శాతం రిజిస్ట్రేషన్ టాక్స్‌ను పెంచి ఎల్ఆర్ఎస్ను కట్టని ప్లాట్లకు క్రయవిక్రయాలు జరగవని, ఇలాంటి దోరనలు మానుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞపి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి లతీఫ్, నాయకులు వెంకట్ నారాయణ, కొండలు, జాని, నాగుల్ మీరా, రెహమాన్, నాగేశ్వరరావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.