Take a fresh look at your lifestyle.

25 ‌రూపాయాలు పెరిగిన గ్యాస్‌ ‌ధర

హైదరాబాద్‌లో 877.50కు చేరిన సబ్సిడీ గ్యాస్‌ ‌ధర
చమురు కంపెనీలు పెట్రోలియం ధరలను రోజురోజుకూ పెంచుతూ జామాన్యుడిపై మోయలేనంత భారం మోపుతున్నాయి. పెట్రోధరలకు తోడు తాజాగా గురువారం వంటగ్యాస్‌ ‌ధరలను పెంచాయి. 12.2 కిలోల బరువున్న సబ్సిడీ సిలిండర్‌పై రూ.25.50 పెంచాయి. పెరిగిన ధరలు గురువారం నుంచి అములులోకి వొస్తాయని స్పష్టం చేశాయి. పెంచిన ధరతో దేశ రాజధానిలో సిలిండర్‌ ‌ధర రూ.834.50కు చేరింది. మరో వైపు 19 కిలోల సిలిండర్‌పై సైతం రూ.76 పెరిగింది. దీంతో దేశ రాజధానిలో వాణిజ్య సిలిండర్‌ ‌ధర రూ.1550కు చేరువైంది. హైదరాబాద్‌లో వంట గ్యాస్‌ ‌సిలిండర్‌పై రూ.16 పెరిగింది.

ప్రస్తుతం ధర రూ.861 ఉండగా.. పెంపుతో రూ.877.50కు చేరింది. వాణిజ్య సిలిండర్‌పై రూ.84 పెరగ్గా.. రూ.1768కు పెరిగింది. లిక్విడ్‌ ‌పెట్రోలియం గ్యాస్‌(ఎల్‌పీజీ) లేదా కిచెన్‌ ‌గ్యాస్‌ ‌రేట్లు సవరించాయి. ప్రతి ఐదురోజులకోసారి అంతర్జాతీయ మార్కెట్‌ ‌ధరలకు అనుగుణంగా చమురు కంపెనీలు ఎల్‌పీజీ ధరలను సవరిస్తాయి. గత నెలలో వాణిజ్య సిలిండర్ల ధర రూ.122కు చమురు కంపెనీలు తగ్గించాయి. దీంతో 19 కిలో సిలిండర్‌ ‌రూ.1473.50కు తగ్గింది. అయితే, సబ్సిడీ ఎల్‌పీజీ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ ఏడాది జనవరి నుంచి సబ్సిడీ సిలిండర్ల ధరలు దాదాపు ఐదుసార్లు పెరిగాయి. చివరి సారిగా మార్చిలో ధరలు పెంచారు.

Leave a Reply