Take a fresh look at your lifestyle.

‌ప్రేమించి మోసం చేశాడు…

lover cheates

కారేపల్లి : తనను అజ్మీరా సంపత్‌కు మార్‌ అనే వ్యక్తి ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఓ యువతి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. యువతి, ఆమె కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం భాగ్యనగర్‌ ‌తండా గ్రామానికి చెందిన వాంకుడోత్‌ ‌లాలు, లక్ష్మీ దంపతుల చిన్న కూతురు సోనియా ఖమ్మం లో డిగ్రీ చదువుతుంది.  తన వదినకి తమ్ముడు అయిన పోలంపల్లి గ్రామ శివారు దుబ్బతండాకి చెందిన  సంపత్‌ ‌కుమార్‌ ‌తనను మాయమాటలతో గత నాలుగు సంవత్సరాలుగా ప్రేమించానని, పెళ్లిచేసుకుంటానని నమ్మించి అన్ని విధాలుగా వాడుకున్నాడని వాపోయింది.  గత మూడు నెలల నుంచి సంపత్‌ ‌కుమార్‌ ‌నాతో మాట్లాడకుండా దూరంగా ఉంటున్నాడని తనకు డిగ్రీ పరీక్షలు ఉండటం వలన ఆపనిలో నిమ్నగమయ్యాయనని తెలిపింది. గురువారం సంపత్‌ ‌తొమ్మిదో మైలు తండా గ్రామానికి చెందిన వేరే అమ్మాయితో వివాహం చేసుకున్నాడని గ్రామస్తుల ద్వారా తమకు తెలిసిందని  ఇదేమిటని అతనిఇంటికి వెళితే అప్పటికే అతని ఇంట్లో నుంచి ఎటో వెళ్లిపోయాడని పేర్కొంది. ఈ విషయాన్ని గ్రామ పెద్దలకు, మా కుటుంబ సభ్యులకి తెలియపరిచి స్థానిక పోలీస్‌ ‌స్టేషన్లో ఫిర్యాదు చేసానని తనకు న్యాయం చేయాలని వేడుకుంది. ఈవిషయమై ఎస్‌ఐ ‌పొదిలి వెంకన్న దర్యాప్తు చేసి కేసు నమోదు చేసారని తెలిపింది.

Tags: cheated, lover cheated, azmira sampath kumar, bhagyanagar tanda, sonia, khammam

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply