Take a fresh look at your lifestyle.

కబళిస్తున్న కొరోనా

  • భారత్‌లో పాజీటివ్‌ ‌కేసులు.. 3,188
  • 68 మంది మరణం..కోలుకున్న వారు.. 183
  • దాదాపు 17 రాష్టాల్ల్రో తబ్లిగి జమాత్‌ ‌ప్రభావం: కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్‌ ‌సెక్రటరీ లవ్‌ అగర్వాల్‌ 

భారత్‌ ‌కరోనా వైరస్‌ ‌వేగంగా విస్తరిస్తుండటంతో కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నది. దేశవ్యాప్తంగా 3,188 కరోనా పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్‌ ‌సెక్రటరీ లవ్‌ అగర్వాల్‌ ‌తెలిపారు. శనివారం డియా సమావేశంలో లవ్‌ అగర్వాల్‌ ‌మాట్లాడుతూ.. భారత్‌లో 24 గంటల్లోనే కొత్తగా 601మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయిందన్నారు. కరోనా బారినపడి మరో 12 మంది మృతి చెందడంతో భారత్‌లో ఇప్పటి వరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 68కు చేరింది. శనివారం వరకు మొత్తం 183 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో మొత్తం 2,902 కరోనా పాజిటివ్‌ ‌కేసులు ఉన్నాయన లవ్‌ అగర్వాల్‌ ‌వివరించారు. దేశ వ్యాప్తంగా దాదాపు 22 వేల మందికి పైగా తబ్లిగి జమాత్‌ ‌కార్యకర్తలు వారి సన్నిహితులను గుర్తించి క్వారంటైన్‌కి తరలించినట్టు వెల్లడించారు. ఇప్పటి వరకు నమోదైన కోవిడ్‌-19 ‌పాజిటివ్‌ ‌కేసుల్లో 1,023 మంది (30 శాతం) తబ్లిగి జమాత్‌కి సంబంధించిన వారే ఉన్నారని పేర్కొన్నారు. దాదాపు 17 రాష్టాల్ల్రో తబ్లిగి జమాత్‌ ‌ప్రభావం పడినట్టు తెలిపారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,902 కరోనా పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయనీ.. ఇందులో గత 24 గంటల్లోనే 601 కొత్త కేసులు వెలుగుచూశాయన్నారు. కరోనా మహమ్మారి కారణంగా దేశంలో 68 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అగర్వాల్‌ ‌పేర్కొన్నారు. భారత్‌ ‌లో లాక్‌ ‌డౌన్‌ ‌విధించినా కరోనా కేసుల సంఖ్య తగ్గడంలేదు సరికదా, గత కొన్నిరోజుల వ్యవధిలో పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య మరింత పెరిగింది. దీన్నిబట్టే భారత్‌ ‌లో ఇప్పుడు కీలకదశ నెలకొందని అర్థమవుతోంది. ఇటీవల ఢిల్లీలో తబ్లిగీ జమాత్‌ ‌పేరిట ఓ మతపరమైన కార్యక్రమం జరిగింది. అప్పటినుంచి కేసులు ఎక్కువగా నమోదవుతుండడంతో జమాత్‌ ‌కు హాజరైన వారికోసం అధికారవర్గాలు ఇప్పటికీ గాలిస్తున్నాయి. ఓ వారం రోజులుగా నమోదవుతున్న కరోనా పాజిటివ్‌ ‌కేసుల్లో అత్యధికం జమాత్‌ ‌కు హాజరైన వారే కావడం గమనార్హం.

- Advertisement -

మరోవైపు ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇంట్లో తయారుచేసిన ఫేస్‌ ‌మాస్క్‌లను ఉపయోగించమని ప్రజలను కోరింది. అనారోగ్య వైద్య పరిస్థితితో బాధపడని వారు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు లేని వారు చేతితో తయారు చేసిన పునర్వినియోగ ఫేస్‌ ‌మాస్క్ ‌లు ఉపయోగించాలని, ప్రత్యేకించి ఇంటి నుండి బయటికి వచ్చినప్పుడు ప్రజలు మాస్క్ ‌లు ధరించాలి అని ఆరోగ్య శాఖ కోరింది. మరోవైపు, భారతీయ రైల్వే తన ప్రయాణీకుల సేవలను లాక్డౌన్‌ అనంతరం దశలవారీగా తిరిగి ప్రారంభించడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేస్తున్నది. అయితే ఈ విషయంపై ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోవలసి వుంది. అలాగే, తబ్లిఘి జమాత్‌ ‌ప్రార్ధనకై వచ్చిన వారిలో ఇప్పటివరకు 247 మందిని గుర్తించారు. మార్కాజ్‌ ‌నిజాముద్దీన్‌ ‌లో జరిగిన సమావేశానికి హాజరైన వారందరినీ ఇంకా ప్రభుత్వం గుర్తించాల్సి వుంది. ప్రధాని నరేంద్ర మోడీ శనివారం సాధికారిక సమూహా సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహించారు, ఈ సమావేశంలో దేశంలో %•••×ణ%-19 నివారణ కార్యకలాపాల ప్రణాళిక అమలు గురించి చర్చించారు. ఈ సమావేశంలో, ఆసుపత్రుల లభ్యత, సరైన కొరెంటైన్‌ ఏర్పాట్లను, ఐసొలేషన్‌ ‌సౌకర్యాలతో పాటు వ్యాధి పర్యవేక్షణ,కరోనా పరీక్షలు, క్లిష్టమైన సంరక్షణ శిక్షణకు సంబంధించి దేశవ్యాప్తంగా అమలు అవుతున్న ఏర్పాట్లను సమీక్షించారు. ముఖ్యముగా, పిపిఇలు, మాస్క్ ‌లు , గ్లౌజ్లు వెంటిలేటర్లు వంటి అన్ని అవసరమైన వైద్య పరికరాల తగినంత ఉత్పత్తి, సేకరణ, లభ్యత జరిగేలా చూడాలి అని ప్రధాని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం రాష్ట్రాల వారీ డేటా ఇలా ఉంది. ఈ రోజు దేశంలో ఆరు మరణాలు సంభవించాయి – మహారాష్ట్ర నుండి మూడు, ఢిల్లీ నుండి రెండు గుజరాత్‌ ‌నుండి ఒకటి. ఈ విధంగా, మహారాష్ట్రలో ఇప్పటివరకు అత్యధిక మరణాలు (19) నమోదయ్యాయి, ఆ తరువాత మధ్యప్రదేశ్‌ (11), ‌తెలంగాణ (7), గుజరాత్‌ (9), ‌ఢిల్లీ (6), పంజాబ్‌ (5), ‌కర్ణాటక (3), పశ్చిమ బెంగాల్‌ ( 3), ‌జమ్మూ కాశ్మీర్‌ (2), ఉత్తర ప్రదేశ్‌ (2), ‌కేరళ (2). ఆంధ్రప్రదేశ్‌, ‌తమిళనాడు, బీహార్‌, ‌హిమాచల్‌ ‌ప్రదేశ్లలో ఒక్కొక్కరు మరణించినట్లు తెలుస్తున్నది.దేశంలో కరోనా పాజిటివ్‌ ‌కేసులు 2,902 మంది అయితే అందులో 55 మంది విదేశీ పౌరులు ఉన్నారు.

Leave a Reply