Take a fresh look at your lifestyle.

లూ కేఫ్‌ ‌టాయిలెట్లను ప్రారంభించిన చీఫ్‌ ‌విప్‌

‌వరంగల్‌ ‌మహా నగరంలో పలు చోట్ల కార్పొరేట్‌ ‌స్థాయిలో ఏర్పాటు చేసిన లూ కేఫ్‌ ‌టాయిలెట్లను ప్రభుత్వ ఛీఫ్‌ ‌విప్‌, ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్‌, ‌కలెక్టర్‌ ‌రాజీవ్‌ ‌గాంధీ హన్మంతు, మున్సిపల్‌ ‌కమిషనర్‌ ‌పమేలా సత్పతితో కలిసి శుక్రవారం ప్రారంభించారు. పలు రకాల డిజైన్‌ ‌ఫ్లోరింగ్‌తో పాటు రెండు షీ టాయిలెట్లు, రెండు మెన్‌ ‌టాయిలెట్లు, రెండు మూత్రశాలలు,వాష్‌బేషన్‌, ‌బేబీ ఫీడింగ్‌ ‌రూం ఏర్పాటు చేశారు.

లూ కేఫ్‌ ‌టాయిలెట్ల ముందు భాగంలో కాఫీ సెంటర్లను ఏర్పాటు చేశారు. టాయిలెట్‌ ‌నిర్వాహకులకు కాఫీ సెంటర్‌ ‌నిర్వహణ బాధ్యతలు అప్పగించేలా మున్సిపల్‌ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారన్నారు. లూ కేఫ్‌ ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో మంచి గార్డెనింగ్‌ అభివృద్ధి చేయడం ద్వారా కాఫీ సెంటర్‌కు వచ్చే వారికి ఆహ్లాదం కలిగించేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ ‌కమిషనర్‌ ‌నగరపాలక సంస్థ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply