Take a fresh look at your lifestyle.

భద్రాద్రిలో రామయ్య పెళ్లి సందడి

కల్యాణానికి 20 క్వింటాళ్ల తలంబ్రాలు సిద్దం:

ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి కల్యాణ మహోత్సవం దగ్గర పడింది. మార్చి 25 నుండి భద్రాచలం శ్రీ సీతారామచం ద్రస్వామివారి కల్యాణ మహోత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఏప్రియల్‌ 2‌వతేదీన మిధితాస్టేడియంలోని కల్యాణ మండపంలో అత్యంత వైభవంగా స్వామివారి కల్యాణం జరగనుంది,3వతేదీన మహాపట్టాబిషేకం జరగనుంది. ఈ వివాహ వేడుకకు సంబంధించిన పెండ్లి పనులు సోమవారం చిత్రకూటపండపంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. దీంతో రామాలయంలో పెళ్లి సందడి నెలకొంది. ఉదయం అర్చకులు స్వామివారికి ఆలయంలో ఢోలోత్సవం ఘనంగా నిర్వహించారు.

Lord Ramaiah's wedding at Bhadradri

కల్యాణ ఉత్సవమూర్తులకు అభిషేకం, పూర్ణాహుతి చేశారు. అనంతరం రామయ్యకు కంకణ ధారణ చేశారు. శ్రీరామున్ని పెళ్లి కుమారినిగా,సీతమ్మవారిని పెళ్ళికుమార్తెగా అలంకరించారు. బుగ్గన కస్తూరి దిద్ది స్వామిని ఊరేగింపుగా భద్రుని మండపానికి తీసుకొచ్చారు. అనంతరం స్వామివారికి ఆరాధన చేశారు. ఊయలలో కూర్చుండబెట్టి జోలపాటలు పాడారు.అనంతరం స్వామివారికి వసంతోత్సవం జరిగింది. భక్తులు ఆనం దోత్సవా లతో వసంతోత్సవంలో పాల్గొ న్నారు. ఆలయ ప్రథానార్చకులు డోల పౌర్ణమి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

పెళ్లి కొడుకైన రామయ్య:

Lord Ramaiah's wedding at Bhadradri

సిగ్గులొలక పోస్తూ సీతమ్మ ఆయన చెంత కూర్చుంది. ఈ వేడుకను తిలకించిన భక్త జనం పులకించి పోయారు. తొలుత శ్రీరాముని, సీతాదేవికి విశేషస్నపనం నిర్వహించారు. హోమం, పూర్ణాహుతి జరిపించారు. అనంతరం సీ• రామచంద్రులను ఊయలలో కూ ర్చుండబెట్టి కీర్తనలు ఆలపించారు. మూలవరులకు, లక్ష్మీతాయారమ్మ వారికి యాగరాముని, సీతారాములకళ్యాణం నిర్వహించే ఉత్సవమూర్తులకు వసంతోత్సవం జరిగింది. వంజీర పసుపు ముద్దలను స్వామివారు, అమ్మవారిపై ఉంచారు. వసంతోత్సవం నిర్వహించి 108 వత్తుల హారతి నిర్వహించారు. అనంతరం నివేదన జరిగింది. ఈ తంతును కనులారా తిలకించేందుకు భారీ ఎత్తున భక్తులు స్వామివారి ఆలయంకు చేరుకున్నారు.ఆనంధోత్సవాలతో ఆలయంలో రంగుకేళీ ఆడారు.స్వామివారికి జరుగుతున్న తంతున కనులారా చూసారు.మహిళలు స్వామివారి కల్యాణానాకి పసుపు దంచారు.అలాగే ఆలయం అధికారులు ఇఓ నర్సింహులు,జెఇఓ శ్రావణ్‌కుమార్‌లు స్వామివారి కల్యాణం ఉత్సవంలో పాల్గొన్నారు.పెళ్లికుమారుడుగా శ్రీరాములవారు,పెళ్లి కుమార్తెగా సీతమ్మతల్లిని తయారు చేస్తుండగా ఆసన్నివేసాన్ని భక్తులు కనులారా వీక్షించారు.శ్రీ సీతారాములవారిని చూసి భక్తులు మైమరిచిపోయారు.

పెళ్లికి 20 క్వింటాళ్ల తలంబ్రాలు తయారు:

Lord Ramaiah's wedding at Bhadradriఏప్రియల్‌ 2‌న జరిగే శ్రీ సీతారాముల వారి పెళ్లికి 20 క్వింటాళ్ల తలంబ్రాలు సిద్దం చేసారు. బియ్యంలో సుగంధద్రవ్యాలు, పసుపు కుంకుమలతో కలగలిపి తలంబ్రాలను సిద్దం చేస్తున్నారు. వేద పండితుల మంత్రోశ్చరణల నడుమ ఈ కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్దలతో సాగింది. స్వామివారి తలంబ్రాలు భక్తులు ఎంతో పవిత్రంగా భావించి తీసుకుంటారు కాబట్టి వాటికున్న పవిత్రత ఎక్కడా దెబ్బతినకుండా ఆలయాధికారులు కార్యచరణ రూపొందించారు. 20 క్వింటాళ్ల తలంబ్రాల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాకమండలం నుండి ఆదివారం గోటితలంబ్రాలతో కలినడకన బయలు దేరిన రామభక్తులు సోమవారం ఉదయంకు రామాలయంకు చేరుకున్నారు.వారు తీసుకువచ్చిన గోటితలంబ్రాలు కూడా 20 కింటాళ్ళ తలంబ్రాలలో కలపడం జరిగింది.అలాగే కొన్ని ముత్యాలు కూడా కలిపారు.

Leave a Reply