Take a fresh look at your lifestyle.

శ్రీకృష్ణుడు శిశుపాలుని తప్పులు లెక్కపెట్టినట్టు… నేను బిజెపి నేతల తప్పులు లెక్కపెట్టాను….

  • బిజెపి నేతలవి ఒకటి కాదూ…రెండు కాదూ..ఏకంగా 11 జూటా మాటలున్నాయ్‌…
  • ‌మీడియా సమావేశంలో నిప్పులు చెరిగిన మంత్రి హరీష్‌రావు

భారతీయ జనతా పార్టీ నేతలపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు మరోసారి తీవ్రంగా మండిపడ్డారు. బిజెపికి చెందిన కార్యకర్త మొదలుకుని, దుబ్బాక అభ్యర్థి, రాష్ట్ర అధ్యక్షుడు వరకు అందరూ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారనీ విరుచుకుపడ్డారు. జూటా నేతల మాటలు వింటే మోసపోతాం, గోసపడుతామన్నారు. బిజెపి నేతల మాదిరిగా పూటకో పుకారు, గంటకో అబద్ధం, రోజుకో జూటా మాటలు మాట్లాడటం తమకు చేతకాదనీ, ఏదైతే చెబుతామో ఆ పనిని చేసి తీరుతామన్నారు. ‘వెయ్యి అబద్ధాలు ఆడైనా ఒక పెండ్లి చేయాలన్నది తెలంగాణలో సామెత’ ఉందనీ, కానీ, బిజెపి నేతలు మాత్రం వెయ్యి అబద్దాలు ఆడైనా సరే ఒక దుబ్బాక ఎన్నికల్లో గెలవాలనీ కొత్త సామెతను సృష్టిస్తున్నారనీ, పుకార్లు పుట్టించే, అబద్ధాలాడే, తప్పుడు ప్రచారం చేసే బిజెపి నేతల మాటలు ఎంతో చైతన్యవంతమైన దుబ్బాక గడ్డ మీద చెల్లవన్నారు.

శుక్రవారం జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ..దుబ్బాక ఉప ఎన్నిక ప్రారంభమైనప్పటి నుంచీ ఒక్క బిజెపి నాయకుడు నిజం మాట్లాడలేదనీ, అన్నీ అబద్ధాలే పునాదులుగా బిజెపి తప్పుడు ప్రచారాలకు తెరతీసిందన్నారు. అబద్ధమే ఆయుధంగా బిజెపి కార్యకర్త మొదలుకుని రాష్ట్ర అధ్యక్షుడు వరకు ప్రచారం చేస్తున్నారనీ అన్నారు. సత్యమేవ జయతే అనే ఉపనిషత్‌ ‌సూక్తిని బిజెపి నేతలు విస్మరించారనీ, అసత్యమేవ జయతే అనే సిద్ధాంతంతో బిజెపి నేతలు ముందుకెళ్తున్నారనీ అన్నారు.

శ్రీకృష్ణుడు శిశుపాలుని తప్పులు లెక్కపెట్టినట్లుగా దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారం మొదలైనప్పటి నుంచీ బిజెపి నేతల మాటలు లెక్కపెట్టాననీ…ఇప్పటి వరకు దుబ్బాక ఎన్నికల ప్రచారంలో బిజెపి నేతలు ఒకటి కాదూ…రెండు కాదూ…ఏకంగా 11జూటా మాటలు మాట్లాడరన్నారు. పట్టపగలు పచ్చి అబద్దాన్ని ప్రచారం చేస్తుంటే చూస్తూ ఊరుకోలేక బీడీ కార్మికులకు తాము ఇస్తున్న 2వేల 116లో 16పైసలు కేంద్ర ఇచ్చినట్లు రుజువు చేస్తే మంత్రి, ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేస్తాననీ సవాల్‌ ‌విసిరితే ఇప్పటి వరకు జవాబు లేదు. తాను విసిరిన సవాల్‌కు బిజెపి నేతలందరూ తోకమూడిచారన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply