Take a fresh look at your lifestyle.

‌ప్రశాంతంగా ముగిసిన గణేష్‌ ‌విగ్రహ నిమజ్జనోత్సవం

సాదాసీదాగా సాగిన ముగిసిన శోభాయాత్ర
ఎప్పటిలా హంగు, ఆర్భాటం లేకుండా ఖైరతాబాద్‌ ‌వినాయక విగ్రహ నిమజ్జనం

ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా హైదరాబాద్‌లో గణేష్‌ ‌నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. గతానికి భిన్నంగా ప్రశాంత వాతావరణంలో సాదాసీదాగా నిమజ్జనోత్సవాలు ముగిశాయి. ధన్వంతరి నారాయణ మహాగణపతిగా పూజలందుకున్న ఖైరతాబాద్‌ ‌గణనాథుడు గంగమ్మ ఒడికి చేరాడు. ఎన్టీఆర్‌ ‌మార్గ్ ‌వద్ద ఏర్పాటు చేసిన క్రేన్‌ ‌నం. 4 వద్ద మహాగణపతి నిమజ్జనం విజయవంతంగా పూర్తయింది. మహాగణపతి నిమజ్జనాన్ని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. నిమజ్జనం కంటే ముందు.. గణేష్‌ ఉత్సవ సమితి నిర్వాహకులు గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ వేడుకను చూసి భక్తులు తన్మయత్వం చెందారు. బై బై గణేశా నినాదాలతో ట్యాంక్‌ ‌బండ్‌, ఎన్టీఆర్‌ ‌మార్గ్ ‌పరిసరాలు మార్మోగి పోయాయి.

మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఖైరతాబాద్‌ ‌మహాగణపతి శోభాయాత్ర.. భక్తుల సందడి మధ్య ఐదారు గంటల పాటు శోభాయమానంగా సాగింది. కొరోనా వైరస్‌ ‌నేపథ్యంలో గణేశ్‌ ‌నవరాత్రి ఉత్సవాలు నిరాడంబరంగా సాగాయి. వైరస్‌ ‌ప్రభావంతో ఉత్సవాల శోభ కాస్త తగ్గినా.. విగ్రహాల సంఖ్య మాత్రం తగ్గలేదు. ప్రతి ఇంటిలో ప్రతిష్టించిన చిన్నచిన్న గణనాథుల నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగింది. గణేష్‌ ‌నిమజ్జనం సందర్భంగా ప్రతి ఏడాది సందడి ఉండే చార్మినార్‌ ‌ప్రాంతంలో ఇప్పుడు ఎలాంటి సందడి లేకుండా పోయింది. ప్రస్తుతం కోవిడ్‌ ‌నేపథ్యంలో చార్మినార్‌ ‌గేట్‌ ‌వరకు కూడా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. గత ఏడాది గణేష్‌ ‌నిమజ్జనంలో ఇసకేస్తే రాలనంత జనంతో కిటకిటలాడే రోడ్లు.. ఖాళీగా కనిపించాయి. పోలీసులు కూడా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. డియాకు కూడా ఆంక్షలు విధించారు. కి.. దూరం వరకు ఎవరినీ అనుమతించడంలేదు. వాహనాలను దారి మళ్లించారు. గతంతో పోలిస్తే ఈసారి చార్మినార్‌ ‌ప్రాంతం ఖాళీగా బోసిపోయి దర్శనమిచ్చింది. రోడ్లు ఇంత ఖాళీగా ఉండడం ఇదే మొదటిసారి.

Leave a Reply