Take a fresh look at your lifestyle.

వడ్డీ భారం పడకుండా చూడండి

మారటోరియంపై కేంద్రానికి, ఆర్‌బిఐకి సుప్రీమ్‌ ‌కోర్టు సూచన
మారటోరియం గడువు 28 వరకు పొడిగింపు..
అప్పటి వరకు ఎన్‌పీఏలుగా ప్రకటించరాదని
బ్యాంకులకు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశం

మారటోరియం వ్యవధిలో నిలిచిపోయిన ఈఎంఐలపై వడ్డీ వసూలు చేయరాదని దాఖలైన పిటిషన్‌పై సుప్రీమ్‌కోర్టు కేందప్రభుత్వం, ఆర్‌బీఐ, బ్యాంకులకు రెండు
వారాల సమయం ఇచ్చింది. కొరోనా వైరస్‌ ‌నేపథ్యంలో ఈఎంఐల చెల్లింపుపై ఆర్‌బీఐ ఆరు నెలల మారటోరియం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మారటోరియం వ్యవధిలో నిలిచిపోయిన ఈఎంఐలపై వడ్డీ వసూలు చేస్తామని బ్యాంకులు ప్రకటించాయి. వడ్డీపై వడ్డీ వసూలు సరైంది కాదని సుప్రీమ్‌కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఇక రుణగ్రహీతలపై భారం పడకుండా రెండు వారాల్లోగా కేంద్ర ప్రభుత్వం, బ్యాంకులు, ఆర్‌బీఐ ఓ నిర్ధిష్ట విధానంతో కోర్టు ముందుకు రావాలని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీమ్‌కోర్టు ధర్మాసనం గురువారం స్పష్టం చేసింది. ఈ కేసును మరోసారి వాయిదా వేసేందుకు నిరాకరించిన సర్వోన్నత న్యాయస్ధానం ఇదే చివరి అవకాశమని రెండు వారాల్లోగా రుణగ్రహీతలకు భారం పడనివిధంగా పరిష్కారంతో అఫిడవిట్‌ ‌సమర్పించాలని కోరింది.
రుణగ్రహీతలకు ఊరట ఇచ్చేలా బ్యాంకులతో  ఉన్నతస్ధాయిలో సంప్రదింపులు జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం కోర్టుకు వివరించింది. మరోవైపు సెప్టెంబర్‌ ‌చివరివారంలో కేసు విచారణ తిరిగి ప్రారంభమయ్యేవరకూ ఆయా ఖాతాలను నిరర్ధక ఆస్తులుగా పరిగణించరాదని కోర్టు స్పష్టం చేసింది. మారటోరియం వ్యవధిలో ఈఎంఐలపై వడ్డీ మాఫీ చేస్తే అది బ్యాంకింగ్‌ ‌వ్యవస్ధను బలహీనపరుస్తుందని బ్యాంకులు వాదిస్తున్నాయి. కాగా కొరోనా వైరస్‌ ‌నేపథ్యంలో ఆర్‌బీఐ రుణాల చెల్లింపుపై ఈ ఏడాది మార్చిలో మూడు నెలల మారటోరియం ప్రకటించి ఆపై ఆగస్ట్ 31 ‌వరకూ పొడిగించిన సంగతి తెలిసిందే.మారిటోరియం గడువు 28 వరకు పొడిగింపు..అప్పటి వరకు ఎన్‌పీఏలుగా ప్రకటించరాదు.. బ్యాంకులకు సుప్రీమ్‌ ‌కోర్టు ఆదేశం రుణ గ్రహీతలు రుణాలను తిరిగి చెల్లించడంపై మారటోరియం గడువును సుప్రీమ్‌కోర్టు ఈ నెల 28 వరకు పొడిగించింది. ఈ గడువు సమయంలో రుణాలను తిరిగి చెల్లించడంలో విఫలమైతే, ఆ రుణాలను నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ)గా ప్రకటించవద్దని బ్యాంకులను ఆదేశించింది.
కోవిడ్‌-19 ‌మహమ్మారి నేపథ్యంలో దేశవ్యాప్తంగా అష్ట దిగ్బంధనం విధించడంతో భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) మార్చిలో మారటోరియం ప్రకటించిన సంగతి తెలిసిందే. రుణ గ్రహీతలు తాము తీసుకున్న రుణాల కిస్తీలను చెల్లింపుకు విరామం ప్రకటించింది. ఈ పథకం గడువు ఆగస్టు 31తో ముగిసింది. మారటోరియం అమల్లో ఉన్న కాలంలో ఈఎంఐలపై వడ్డీని వసూలు చేయడం గురించి సక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, ఆర్బీఐని సుప్రీంకోర్టు గతంలో కోరింది. కోవిడ్‌-19 ‌మహమ్మారి నేపథ్యంలో ప్రకటించిన మారటోరియం కాలంలో వాయిదా పడిన రుణాల కిస్తీలపై వడ్డీపై వడ్డీని వసూలు చేయడంలో అర్థం లేదని తెలిపింది. మారటోరియం అమలవుతున్న సమయంలో రుణం సొమ్ముపై వడ్డీని వసూలు చేయాలనే నిబంధన ఆర్బీఐ అధికారానికి అతీతమని ప్రకటించాలని న్యాయవాది విశాల్‌ ‌తివారీ సుప్రీంకోర్టును కోరారు. పిటిషనర్‌ ‌రుణ గ్రహీత కావడంతో ఈ నిబంధన వల్ల .

Leave a Reply