Take a fresh look at your lifestyle.

రాజకీయం కోసమే లోకేశ్‌ ‌గుంటూరు పర్యటన

  • కావాలనే రచ్చ చేసేందుకు వచ్చారన్న ముస్తాఫా
  • టిడిపి హయాంలో ఎలా స్పందించారో తెలుసని విమర్శ

గుంటూరు,సెప్టెంబర్‌ 9 : ఇప్పు‌డు లోకేష్‌ ‌గుంటూరులో పర్యటన చేయాల్సిన అవసరమేముందని వైసిపి ఎమ్మెల్యే ముస్తాఫా మండిపడ్డారు. వాల ద పేలాలు ఏరుకుంటూ లోకేష్‌ ‌రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆడపిల్లల చావులను అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడమేంటని ఆయన ప్రశ్నించారు. అన్యాయం జరిగిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేస్తోందని, అయితే జరుగుతున్న ఘటనలు దురదృష్టకరం అని కూడా విచారం వ్యక్తం చేశారు. అందుకే సిఎం జగన్‌ ‌దిశ చట్టాన్ని తీసుకుని వచ్చి కఠినంగా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. దిశ చట్టం ద్వారా మహిళలకు న్యాయం జరిగేలా ప్రయత్నిస్తున్నామని అన్నారు. అయితే పరామర్శల పేరుతో రాజకీయాలు తగవన్నారు. లోకేష్‌ ‌శవ రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. గురువారం ఆయన డియాతో మాట్లాడుతూ, ఏడు నెలల క్రితం అనూష చనిపోతే లోకేష్‌కు ఇప్పుడు గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు.

ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించి, నిందితుడిని 24 గంటల్లోనే పోలీసులు అరెస్ట్ ‌చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన ఆర్థిక సహాయాన్ని మూడో రోజే అందించాం. అనూష కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంది. కులమతాల మధ్య చిచ్చుపెట్టడానికి లోకేష్‌ ‌ప్రయత్నిస్తున్నారని అన్నారు. మొన్న రమ్య మృతదేహం అడ్డంపెట్టుకుని లోకేష్‌ ‌రాజకీయ లబ్ది పొందాలని ప్రయత్నించారు. ఇవాళ 7 నెలల క్రితం చనిపోయిన అనూష కేసును అడ్డంపెట్టుకుని రాజకీయం చేస్తున్నాడు. చంద్రబాబు హయాంలో జరిగిన కాల్‌ ‌మనీ వ్యవహారంలో ఏం జరిగిందో అందరికీ తెలుసునని అన్నారు. ఆనాడి ఇంతకన్నా ఘోరాలు జరిగినా, గోదావరి పుష్కరాల్లో 30మంది చావుకు కారణమైనా సమాధానం చెప్పారా అని అన్నారు. ఘటనలు జరిగినప్పుడు ఎంత త్వరగా స్పందించి చర్యలు తీసుకున్నారన్నదే ముఖ్యమని అన్నారు.

Leave a Reply