Take a fresh look at your lifestyle.

దేవినేనిపై కేసులు.. అరెస్టుపై భగ్గుమన్న టిడిపి

  • అక్రమ కేసులతో బెదరింపులా అని నేతల ప్రశ్న
  • వైకాపా ప్రభుత్వ తీరుపై మండిపడ్డ యనమల తదిరులు
  • రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందన్న లోకేశ్‌

విజయవాడ,జూలై 28 : మాజీమంత్రి దేవినేని ఉమ అరెస్టుపై టిడిపి శ్రేణులు మండిపడ్డాయి. ఆయనను అక్రమంగా అరెస్ట్ ‌చేశారని విమర్శలు గుప్పించారు. మొత్తంగా 12 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై వైసీపీ కార్యకర్తలు దాడిచేశారు. రాళ్లు, కర్రలతో విరుచుకుపడ్డారు. ఈ దాడిలో ఆయన కారు కొంత దెబ్బతినగా… వెనుకే ఉన్న మరో టీడీపీ నేత కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై వైసీపీ కార్యకర్తలు దాడిచేశారు. రాళ్లు, కర్రలతో విరుచుకుపడ్డారు. ఈ దాడిలో ఆయన కారు కొంత దెబ్బతినగా… వెనుకే ఉన్న మరో టీడీపీ నేత కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. మంగళవారం రాత్రి కృష్ణా జిల్లా జి.కొండూరు మండలం గడ్డమణుగులో ఈ దాడి జరిగింది. ఆ తర్వాత జి.కొండూరు ఠాణా వద్ద రాత్రి పొద్దుపోయే దాకా ఉద్రిక్తత కొనసాగింది. తిరిగి పోలీసులు దేవినేనిపైనే 158, 147, 148, 341, 323, 324, 307, 427, 506, 353, 332, 149 సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం గమనార్హం. ఈ క్రమంలో కృష్ణా జిల్లా నందివాడ పోలీస్‌ ‌స్టేషన్‌ ఎదుట టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి.

మాజీ మంత్రి దేవినేని ఉమ అక్రమ అరెస్టును ఖండిస్తూ నిరసనకు దిగారు. దేవనేని ఉమను చూపించాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. నందివాడ పోలీస్‌ ‌స్టేషన్‌ ‌దగ్గర పోలీస్‌ ‌బలగాలు భారీగా మోహరించాయి. ఇదిలావుంటే దేవినేని అరెస్ట్‌పై పార్టీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. వైసీపీ పాలన అవినీతి, అరాచకమని టీడీపీ సీనియర్‌ ‌నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. బుధవారం ఆయన ఇక్కడ డియాతో మాట్లాడుతూ దేవినేని ఉమ కారుపై వైసీపీ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రంలో వైసీపీ నేతల దోపిడీకి అదుపు లేకుండా పోతోందన్నారు. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ ‌కనుసన్నల్లోనే వేల కోట్ల గ్రావెల్‌ ‌తవ్వకాలు జరుగుతు న్నాయని ఆయన ఆరోపించారు. సహజ వనరుల దోపిడీని అడ్డుకుంటే హత్యాయత్నానికి పాల్పడతారా? అంటూ ప్రశ్నించారు. దాడులు, అక్రమ అరెస్టులకు భయపడేది లేదన్నారు. వైసీపీ నేతల సహజవనరుల దోపిడీపై టీడీపీ పోరాటం ఆగదని యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు.

దేవినేని ఉమపై దాడి హేయమైన చర్యని మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు. ఆయన డియాతో మాట్లాడుతూ ఫ్యాక్షనిస్టు పాలనలో ప్రశ్నించే వారిపై దాడులు సర్వ సాధారణ మయ్యాయన్నారు. మాజీమంత్రికే రక్షణ లేకపోతే సామాన్యుడి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. దేవినేనిపై దాడిని ప్రజాస్వామ్య స్వేచ్ఛపై దాడిగానే చూడాలన్నారు. దాడి చేసిన వారితో పాటు ఉసిగొల్పిన వైసీపీ నాయకులను వెంటనే అరెస్ట్ ‌చేయాలని, దేవినేని ఉమకు సాయుధ రక్షణ కల్పించాలని డిమాండ్‌ ‌చేశారు. దేవినేనిపై దాడికి జగన్‌ ‌ప్రభుత్వమే బాధ్యత వహించాలని కాలవ శ్రీనివాసులు అన్నారు. టీడీపీ నేత దేవినేని ఉమపై దాడి అమానుషమని మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. వైసీపీ గూండా రాజకీయాలను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఒక్కరిపై 100 మంది దాడి పిరికిపింద చర్యగా అభివర్ణించారు. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ ‌ప్రోద్భలంతోనే దేవినేని ఉమపై దాడి జరిగిందని ఆరోపించారు. అవినీతి, అక్రమాలను అడ్డుకుంటే దాడులకు పాల్పడతారా? అని ప్రశ్నించారు. ప్రజా సంపదను వైసీపీ నేతలు దోచుకుంటుంటే అడ్డుకోవడం తప్పా? అని నిలదీశారు. రాష్ట్రంలో మాజీ మంత్రికే రక్షణ లేకుంటే సామాన్యుల పరిస్థితేంటని చినరాజప్ప తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేవినేని ఉమపై దాడి పిరికిపంద చర్య అని మాజీమంత్రి నక్కా ఆనందబాబు విమర్శించారు.

దాడి చేసినవారిని వదిలి గాయపడిన వ్యక్తిని అరెస్ట్ ‌చేయడం దారుణ మన్నారు. జగన్‌ ‌పాలనలో వైసీపీ నేతల బరితెగింపునకు ఇదే నిదర్శనమన్నారు. వైసీపీ నేతలను ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆనందబాబు పేర్కొన్నారు.మైనింగ్‌కు, ఎస్సీ, ఎస్టీలకు సంబంధమేంటని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు ప్రశ్నించారు. దేవినేనిపై దాడి చేసినవారిని వదిలేసి.. టీడీపీ కార్యకర్తలపైనే తప్పుడు కేసులు పెడతారా? మండిపడ్డారు. వైసీపీ గూండాలు, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ ‌మనుషులు.. దేవినేని, ఆయన అనుచరులపై దాడికి తెగబడ్డారన్నారు. దాడికి పోలీసులు దగ్గరుండి సహకరించారన్నారు. ఉమాపై ఎమ్మెల్యే దగ్గరుండి మరీ దాడి చేయించారని అశోక్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేత దేవినేని ఉమపై సీఎం జగన్‌ ‌రాజారెడ్డి రాజ్యాంగాన్ని ప్రయోగిం చారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ‌విమర్శించారు. దాడికి పాల్పడ్డవారిని అరెస్ట్ ‌చేయాల్సిన పోలీసులు… బాధితులను నిందితుల్ని చేసి అరెస్ట్ ‌చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా మన్నారు. ఇలాంటి పోలీస్‌ ‌వ్యవస్థ రాష్ట్రంలో ఉండడం దురదృష్టమన్నారు. మాజీమంత్రి పరిస్థితే ఇలా ఉంటే.. సామాన్యుల పరిస్థితేంటని ప్రశ్నించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అన్యాయంగా వ్యవహరిస్తు న్నారని లోకేష్‌ ‌తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Leave a Reply