Take a fresh look at your lifestyle.

లోకకల్యాణ విభుడవు

దైవాంశ సంభూతుడవు..
మనిషిగా మా మధ్యనే సంచరిస్తూ..
ధర్మ పాలన అందిస్తూ..
తండ్రిమాటను జవదాటని ఓరామా..!
పదునాలుగేండ్ల అరణ్యవాసంతో
పితృ వాక్య పరిపాలకుడిగా పేరుందిన…
ఓ  దశరథ రామా ఓ శ్రీరామ..!
మానవ విలువలను తెలియజేస్తూ
ఏక పత్నివ్రతుడుగా నిలిచి ….
ఆలుమగలు ఆప్యాయతానురాగాలకు
చిహ్నంగా …నిలిచిన జానకి రామా! ఓ శ్రీరామ..!
ప్రజాభీష్టం మేరకు ప్రజా పాలన చేసి లోకాభిరాముడిగా
కొనియాడబడిన లోకోత్తమ పురుషా..రామా ఓ శ్రీరామ..!.
నీ కల్యాణమే లోక కల్యాణంగా
జరుపుకునేలా చేసిన దైవానివి నీవేకదా రామా.!
వడపప్పు పానకాలతో నిను కొలిచేమయ్యా
కోదండరామా..
మా సీతమ్మకు చిరునవ్వుగవు నీవేనయ్యా శ్రీ రామా
పట్టాభిరామునికి ప్రియవందనం,
అభివందనం
మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు
– శ్రీమతి మంజుల పత్తిపాటి
9347042218

Leave a Reply