Take a fresh look at your lifestyle.

లోక్‌ ‌సభ డిప్యూటీ స్పీకర్‌ ‌పదవి ఖాలీ…!

  • రెండు సంవత్సరాలకు పైగా …రాజ్యాంగ బద్దమయిన ..
  • ఎన్నుకోవడంలో ఆసక్తి చూపని మోడీ సర్కార్‌
  • ‌రెండు రోజులకు ముందే వర్షాకాల సమావేశాలు నిరవధిక వాయిదా

పెగాసస్‌ ‌స్నూపింగ్‌ ‌వివాదంపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ ప్రతిపక్ష సభ్యులు తమ నిరసనలను కొనసాగించడంతో ఆగస్టు 11, బుధవారం నాడు లోక్‌ ‌సభ నిరవధిక వాయిదా పడింది. సభను వాయిదా వేసిన తరువాత, స్పీకర్‌ ఓం ‌బిర్లా మాట్లాడుతూ.. ‘వర్షాకాల సమావేశాల సమయంలో సభ నిర్వహించిన రోజులలో ఏ ఒక్క రోజు ప్రతిపక్షం చర్చలకు అనుమతించలేదు. సభ సజావుగా జరగనందుకు బాధపడుతున్నాను’ అని అన్నారు. ఈ వర్షాకాల సమావేశాల్లో, లోక్‌సభ 21 గంటలు మాత్రమే పనిచేసిందని కేవలం 22 శాతం మాత్రమే పని చేసిందని బిర్లా చెప్పారు. ప్లకార్డులు పట్టుకుని సభ్యులు వెల్‌లోనికి ప్రవేశించడం..వెల్‌లో నినాదాలు చేయడం ‘‘పార్లమెంటరీ సంప్రదాయాలకు అనుగుణంగా లేదు’’ అని ఆయన ప్రతిపక్షాలను తప్పుబట్టారు. పార్లమెంట్‌ ‌సెషన్‌ ‌తన అంచనాల ప్రకారం జరగలేదని ఆయన పేర్కొన్నారు. స్పీకర్‌ ఓం ‌బిర్లా ‘‘ఈ సెషన్‌లో ఆశించిన విధంగా సభా కార్యకలాపాలు జరగకపోవడం నన్ను బాధించింది. సభలో అధిక బిజినెస్‌ ‌జరిగేలా చూడడానికి నేను ఎల్లప్పుడూ ప్రయత్నిస్తాను. ప్రజలకు సంబంధించిన సమస్యలపై చర్చలు జరపటానికి ’’ అని మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఆయనకి తోడుగా పనిచేసే డిప్యూటీ స్పీకర్‌ ‌పదవి మాత్రం ఇప్పటికీ ఖాలీగా వుంది.

17 వ లోక్‌సభకు ఎన్నికలు జరిగి రెండు సంవత్సరాలకు పైగా గడిచినప్పటికీ నరేంద్ర మోడీ నేతృత్వంలోని నేషనల్‌ ‌డెమోక్రటిక్‌ అలయన్స్ ‌ప్రభుత్వం కేంద్రంలో తిరిగి అధికారంలోకి వొచ్చినప్పటి నుండి, లోక్‌సభ డిప్యూటీ లీడర్‌ ‌పదవిని భర్తీ చేయలేదు. ఈ పదవి ప్రతిపక్షంలోని ఒక సభ్యుడికి ఇవ్వాల్సి ఉంటుంది..ఇది ఇప్పటికీ ఖాలీగా ఉంది. ఇది ప్రభుత్వం మర్యాదపూర్వకంగా ఇచ్చే పదవి కాదు. రాజ్యాంగపరంగా ఇవ్వాల్సిన పదవి. స్పీకర్‌ ‌లాగే, డిప్యూటీ స్పీకర్‌ ‌కూడా. స్పీకర్‌ అన్ని శాసన అధికారాలను కలిగి ఉన్న ప్రిసైడింగ్‌ అధికారి పదవి. పెగాసస్‌ ‌స్నూపింగ్‌ ‌సమస్యపై చర్చకు ప్రభుత్వం అంగీకరించలని వర్షాకాల సమావేశాల్లో నిరంతర నిరసనల మధ్య డిప్యూటీ స్పీకర్‌ ‌పదవి కోసం ప్రతిపక్షం డిమాండ్‌ ‌చేసింది. లోక్‌సభలో స్పీకర్‌ ‌చేత నియమించబడిన ఛైర్మన్‌ల ప్యానెల్‌ ఉన్నప్పటికీ ప్రతిపక్షం ఈ డిమాండ్‌ ‌చేసింది. స్పీకర్‌ ‌చేత నియమించబడిన ఛైర్మన్‌ల ప్యానెల్‌లో వివిధ పార్టీల నుండి తొమ్మిది మంది ఎంపీలు ఉంటారు. స్పీకర్‌ ‌చైర్‌లో లేనప్పుడు సభకు అధ్యక్షత వహిస్తారు. అయితే స్పీకర్‌కి ఉన్నటువంటి రాజ్యాంగపరమైన లేదా పరిపాలనాపరమైన అధికారాలు వీరికి వుండవు. తమ మధ్య నుండి ఒక డిప్యూటీ స్పీకర్‌ను ఎన్నుకునే హక్కు ప్రతిపక్షాలకు ఉంటుంది. దీన్ని నిరాకరించడంతో కేందప్రభుత్వంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఆగస్టు 9న, తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌నాయకుడు రాజ్యసభ ఎంపీ డెరెక్‌ ఓ‌బ్రెయిన్‌ ‌రెండు సంవత్సరాలుగా ఖాలీగా ఉన్న లోక్‌ ‌సభలో డిప్యూటీ స్పీకర్‌ ‌పదవి సమస్యను లేవనెత్తారు. ఈ పక్రియలో పార్లమెంటరీ నిబంధనలను బిజెపి ఉల్లంఘిస్తుందని ఆయన ఆరోపించారు.

‘‘ఇది రాజ్యాంగం ఏర్పాటు చేసిన ముఖ్యమైన పోస్ట్ అని తెలుపుతూ అందుకే ఈ పదవి ముఖ్యమైనది. రాజ్యాంగం కూడా స్పీకర్‌ ‌మరియు డిప్యూటీ స్పీకర్‌ ‌కు కలిపి ఎన్నిక జరుగుతుందని చెబుతుంది’’అని ఆయన మీడియా ముందు మాట్లాడారు. అదేవిధంగా, డిప్యూటీ స్పీకర్‌ ‌లోక్‌ ‌సభ రెండవ అత్యున్నత స్థాయి శాసన అధికారి అని అయన అన్నారు. డిప్యూటీ స్పీకర్‌ ‌నియామకంలో జాప్యం అపరిమితంగా జరిగింది. స్పీకర్‌ ఎన్నికైన వెంటనే ఆ స్థానాన్ని భర్తీ చేయాలని రాజ్యాంగం చెబుతోంది. ‘‘స్పీకర్‌ ఎన్నికైన తర్వాత, డిప్యూటీ స్పీకర్‌ ‌కూడా ఎన్నుకోబడతారు. రాజ్యాంగం ప్రకారం ఈ రెండు పోస్టులు ఒకదాని తర్వాత ఒకటి భర్తీ చేయాలి. ముందుగా, స్పీకర్‌ ఎన్నుకోబడాలి, ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్‌ – అది ఒక రోజు లేదా వారం తర్వాత కావచ్చు’’ అని రాజ్యాంగ నిపుణులు ఆచార్య అన్నారు. డిప్యూటీ స్పీకర్‌ ఎప్పుడు ఎన్నుకోబడతారో రాజ్యాంగం చెప్పలేదని తెలుపుతూ ‘‘వీలైనంత త్వరగా’’ డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక జరగాలి అని రాజ్యాంగంలో ఉందని ఆచార్య అన్నారు. ఒక డిప్యూటీ స్పీకర్‌ ‌ప్రతిపక్ష పార్టీ నుండి ఉండాల్సిన అవసరం ఉందా..? అని అడిగినప్పుడు, రాజ్యాంగం అలా చెప్పలేదని, అయితే ఒక కన్వెన్షన్‌ ఉం‌దని, దాని ప్రకారం ప్రతిపక్షానికి ఆ పదవి ఇవ్వబడుతుంది.

‘‘ఎక్కువగా ప్రతిపక్ష సభ్యులకి ఈ పదవి దక్కింది అని’’ అని ఆచార్య అన్నారు. స్వతంత్ర భారతదేశంలో 15 మంది డిప్యూటీ స్పీకర్స్ ఈ ‌పదవి బాధ్యతలు చేపట్టారు. 2019 ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత కూడా ఈ పదవి మోడీ ప్రభుత్వం ఈ పదవిని ప్రతిపక్ష సభ్యుడికి అప్పగించలేదు. ‘‘డెప్యూటీ స్పీకర్‌ ‌సభకు అధ్యక్షత వహించినప్పుడు, అతనికి స్పీకర్‌కు ఉండే అన్ని అధికారాలు ఉంటాయి. డిప్యూటీ స్పీకర్‌ ‌తన పదవి కారణంగా కొన్ని కమిటీల ఎక్స్-అఫిషియో ఛైర్మన్‌ ‌కూడా. స్పీకర్‌ ‌లేనప్పుడు లేదా రాజీనామా చేస్తే లేదా అనారోగ్యం లేదా మరణం లేదా ఏదైనా ఇతర కారణాల వల్ల స్పీకర్‌ ‌కార్యాలయం ఖాలీ అయితే డిప్యూటీ స్పీకర్‌ అధ్యక్షత వహిస్తారు. స్పీకర్‌ ‌పదవి ఖాలీ అయినప్పుడు, డిప్యూటీ స్పీకర్‌కు స్పీకర్‌ అన్ని అధికారాలను స్వీకరిస్తారు. శాసన అధికారాలు మరియు పరిపాలనా అధికారాలను అమలు చేస్తారు. స్పీకర్‌ ‌మరియు డిప్యూటీ స్పీకర్‌ ‌కాకుండా, ఛైర్మన్ల ప్యానెల్‌ ‌కూడా ఉంది. ఇందులో స్పీకర్‌ ‌నియమించిన ఎంపీలు ఉంటారు. స్పీకర్‌ ‌మరియు డిప్యూటీ స్పీకర్‌ ‌లేనప్పుడు, ప్యానెల్‌లోని ఒక వ్యక్తి సభ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఏదేమైనా, వారు ఎటువంటి పరిపాలనా అధికారాలను అనుభవించరు’’ అని ఆచార్య అన్నారు.

20 బిల్లులు పాస్‌..74 ‌గంటల 46 నిమిషాల పాటు జరిగిన లొక్‌సభ : వాయిదా అనంతరం స్పీక్‌ ఓం ‌బిర్లా వెల్లడి
ఈసారి లోక్‌ ‌సభలో 20 బిల్లులు పాసైనట్లు స్పీకర్‌ ‌బిర్లా చెప్పారు. ఓబీసీ బిల్లుకు అన్ని పార్టీల సభ్యులు సహకరించినట్లు ఆయన వెల్లడించారు. స్వాతంత్య్రానికి 75 ఏళ్లు నిండిన నేపథ్యంలో ప్రగతి సవి•క్ష అవసరమని ఆయన తెలిపారు. వర్షాకాల పార్లమెంట్‌లో భాగంగా జూలై 19న ప్రారంభమైన లోక్‌సభ.. రెండు రోజుల ముందే నిరవధిక వాయిదా పడింది. ఈసారి 74 గంటల 46 నిమిషాల పాటు లోక్‌సభ జరిగినట్లు స్పీకర్‌ ‌వెల్లడించారు.

 

Leave a Reply