Take a fresh look at your lifestyle.

రెండు బిల్లులకు లోక్‌ ‌సభ ఆమోదం

మంగళవారం లోక్‌ ‌సభ ప్రతిపక్షాల నిరసనల మధ్య రెండు బిల్లులను ఆమోదించింది. ట్రిబ్యునల్స్ ‌సంస్కరణల బిల్లు 2021…అత్యవసర రక్షణ సేవల బిల్లు 2021 ఈ రెండు బిల్స్ ‌పాస్‌ అయ్యాయి. ఉభయ సభలు పెగాసెస్‌ ‌వివాదంపై నిరసనతో హోరెత్తుతుండగా బిల్లులను ప్రభుత్వం పాస్‌ ‌చేయిస్తున్నది. ఉభయ సభలు ప్రతిపక్షాల నిరసనల మధ్య వాయిదా పడ్డాయి. అత్యవసర రక్షణ సేవల బిల్లు ఎలాంటి చర్చ లేకుండా వాయిస్‌ ‌వోటు ద్వారా ఆమోదం పొందింది. ప్రతిపక్షం ఈ బిల్లును ఉద్యోగుల ప్రజాస్వామ్య హక్కులను కాలరాసే బిల్లు అని నిందించింది. అయినా ప్రభుత్వం ఈ బిల్లును ఆమోదింపజేసుకుంది. సభలో పాల్గొన్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ ఆమోదించడానికి ముందు ప్రభుత్వం ఉద్యోగుల సంఘాలను విశ్వాసంలోకి తీసుకుందని చెప్పారు.

అత్యవసర రక్షణ సేవల బిల్లు ఎవరిని ప్రభావితం చేస్తుంది? అనేది చూసినప్పుడు ఈ బిల్లు  దేశవ్యాప్తంగా ఉన్న 41 ఆర్డినెన్స్ ‌ఫ్యాక్టరీలలోని 70,000 మంది ఉద్యోగులపై ప్రత్యక్ష ప్రభావం చూపనుంది. 70,000 మంది ఉద్యోగులు ఓఎఫ్‌బి కార్పొరేటీకరణ పట్ల అసంతృప్తిగా ఉన్నారు. ఈ బిల్లు తమ సర్వీస్‌ ‌మరియు పదవీ విరమణ పరిస్థితులను ప్రభావితం చేస్తుందనే భయంతో వున్నారు. ఓఎఫ్‌బిల కార్పొరేటీకరణ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టినప్పుడు గత సంవత్సరం సమ్మెలోకి వెళ్తామని ఉద్యోగుల సంఘాలు బెదిరించాయి. పార్లమెంట్‌ ‌మంగళవారం దివాలా మరియు దివాలా కోడ్‌(‌సవరణ) 2021 బిల్లును కూడా ఆమోదించింది. ఇది రాజ్యసభలో కూడా ఆమోదం పొందింది.

Leave a Reply