Take a fresh look at your lifestyle.

వ్యవసాయ కార్యాలయానికి తాళం

Allegations of neglect by farmers - officials in agitation
వ్యవసాయ కార్యాలయం ముందు బైటాయించిన రైతులు

మండల వ్యవసాయ అధికారులు సక్రమంగా విధులు నిర్వహించడం లేదని ఎప్పుడు కార్యాలయానికి తాళం వేసి ఉంటుందని తాము అప్పులు చేసి పంటలు వేసుకోగా పోలాలు ఎండురోగం సోకి నష్టపోతున్న వ్యవసాయ అధికారు లు పట్టించుకోవడం లేదని సోమవారం మండల రైతులు తాళం వేసి కార్యలయం ముందు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తాము అప్పులు చేసి పండించుకున్న వరిపంట లు ఎండురోగంతో ఎండిపోతుండగా మందులకు ఎకరానికి మళ్లీ 10వేల రూపాయల వరకు చేయడం జరిగిందన్నారు. ఖర్చులు చేయగా కొంతమంది పొలాలు బాగుపడగా మరికొంత మంది పొలాలు పూర్తిగా ఎండు రోగానికి గురవుతూనే ఉన్నాయన్నారు. తాము వ్యవసా యం కార్యలయానికి వచ్చి తమ బాధలు చెప్పుకుందామంటే కార్య) యానికి ఎప్పుడు తాళంవేసే ఉంటుందన్నారు. వ్యవసాయ అధికారికి ఫోన్‌ ‌చేస్తే తాను ఫీల్డుపై ఉన్నాని సమాదానం ఇవ్వడం జరుగుతుం దన్నారు. వ్యవసాయ అధికారి, సిబ్బంది ఎవ్వరు కూడా కార్యాలయాని కి రాకుండా ఎప్పుడు అడిగిన ఫీల్డుపైనే ఉన్నామని సమాదానం ఇవ్వడం జరుగుతుందని ఆరోపించారు. ఉన్నత అధికారులు స్పందిం చి మండ ల వ్యవసాయ అధికారులకు తగు సూచనలు ఇచ్చి రైతులకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకొవాలని కోరుతున్నారు.

ఫీల్డ్‌పై వెళ్లడం జరుగుతుంది- వ్యసాయ అధికారి భూంరెడ్డి
వ్యవసాయ రైతుల పొలాలను పరిశీలించడానికి వెళ్లడం జరిగిందని వ్యవసాయ అధికారి భూంరెడ్డి అన్నారు. కార్యలయానికి తాళం వేసి వచ్చామని నాతో పాటు ఇద్దరు సిబ్బంది మాత్రమే ఉన్నామన్నారు. తాను బొప్పాపూర్‌ ‌గ్రామంలో ఫీల్డ్‌పై ఉన్నాని మిగిత సిబ్బంది వేరే వేరే గ్రామాలలో విధులు నిర్వహించడ జరుగుతుందని సమాదానం ఇచ్చారు.

Leave a Reply