Take a fresh look at your lifestyle.

కేవలం కంటైన్‌మెంట్‌ ‌ప్రాంతాలకే … జూన్‌ 30‌వరకు లాక్‌డౌన్‌ …!

*మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం
*హోటళ్లు, ప్రార్థనాలయాలకు, హోటళ్లు, రెస్టారెంట్లు, వసతి సేవలు, షాపింగ్‌ ‌మాల్స్‌కు జూన్‌ 8 ‌నుంచి అనుమతి
*మెట్రో రైలు సేవలకు, సినిమాహాల్స్, ‌జిమ్‌లు, స్విమ్మింగ్‌పూల్స్, ‌పార్కులు, బార్లకు నో
*విద్యాసంస్థలపై నిర్ణయం రాష్ట్రాలకే వదిలేసిన కేంద్రం

కొరోనా కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను కేంద్ర ప్రభుత్వం మళ్లీ పొడిగించింది. దేశవ్యాప్తంగా జూన్‌ 30 ‌వరకు లాక్‌డౌన్‌ను కేంద్రం పొడిగించింది. కేవలం కంటైన్మెంట్‌ ‌జోన్లకే లాక్‌డౌన్‌ ‌పరిమితం చేసింది. కొరోనా వైరస్‌ ‌వ్యాప్తిని నిరోధించటానికి విధించిన లాక్‌డౌన్‌ను దశల వారీగా సడలించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. జూన్‌ 1‌వ తేదీ నుంచి కంటైన్‌మెంట్‌ ‌జోన్లలో లాక్‌డౌన్‌ ఆం‌క్షలు కొనసాగుతున్నాయని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. కంటైన్‌మెంట్‌ ‌జోన్లకు వెలుపల అన్ని కార్యకలాపాలనూ దశల వారీగా సడలించటం జరుగుతుందని తెలిపింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర హోంశాఖ శనివారం సాయంత్రం విడుదల చేసింది. రాష్ట్రాలలో ఆంక్షలు, నిషేధాజ్ఞలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విధించుకోవచ్చునని చెప్పింది.  కంటైన్మెంట్‌ ‌జోన్ల వెలుపల అన్ని కార్యకలాపాలు దశలవారీగా తిరిగి ప్రారంభించుకునేందుకు అనుమతినిచ్చింది.  తాజాగా మరిన్ని సడలింపులతో లాక్‌డౌన్‌ 5.0  ‌మార్గదర్శకాలను  కూడా కేంద్రం విడుదల చేసింది. రాత్రి  9 నుంచి ఉదయం 5 గంటల వరకు మాత్రమే కర్ఫ్యూ కొనసాగనుంది.  జూన్‌ 8 ‌నుంచి ప్రార్థనా మందిరాలు తెరిచేందుకు అనుమతించింది. విద్యాసంస్థలపై జులైలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు స్పష్టం చేసింది.  ఆంక్షల సడలింపులతో కొరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజుల పాటు కొనసాగించాలని కేంద్రాన్ని ఇప్పటికే పలు రాష్ట్రాలు కోరాయి. దేశంలో నానాటికీ కొరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా జూన్‌ 30 ‌వరకూ లాక్‌డౌన్‌ ‌పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే, లాక్‌డౌన్‌ 5.0‌లో భారీగా సడలింపులు ఇచ్చింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. జాతీయ విపత్తు నిర్వహణ చట్టం ద్వారా సంక్రమించిన అధికారాలతో కేంద్రం మరోసారి లాక్‌ ‌డౌన్‌ ‌పొడిగించారు. అయుతే, కంటైన్మెంట్‌ ‌జోన్లలో మాత్రమే జూన్‌ ‌నెలాఖరు వరకు పొడిగించారు. కంటైన్మెంట్‌ ‌జోన్ల వెలుపల విడతల వారీగా, నెమ్మదిగా, పరిస్థితిని బట్టి సడలింపులు చేసుకొనే వెసులుబాటును ఇచ్చారు. జూన్‌ 8 ‌నుంచి దేవాలయాలు, ప్రార్థనా మందిరాలకు అనుమతి ఇచ్చారు. జూన్‌ 8 ‌నుంచి  హోటళ్లు, రెస్టారెంట్లు, వసతి సేవలు, షాపింగ్‌ ‌మాల్స్‌కు అనుమతి ఇచ్చారు. వీటికి మార్గదర్శకాలు కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేయనుంది. పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలు తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకే నిర్ణయాధికారం ఇచ్చింది. విద్యాసంస్థలు పునఃప్రారంభంపై జులైలో నిర్ణయం తీసుకోనున్నారు. విద్యాసంస్థల పునఃప్రారంభం విషయంలో కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు ఇస్తుంది. అయితే మెట్రో రైలు సేవలకు అనుమతి లేదు. అంంతర్జాతీయ విమాన సేవలకు అనుమతి లేదు సినిమాహాల్స్, ‌జిమ్‌లు, స్విమ్మింగ్‌పూల్స్, ‌పార్కులు, బార్లకు అనుమతి లేదు. రాజకీయ, సామాజిక, క్రీడా కార్యక్రమాలపై ప్రస్తుతానికి అనుమతి లేదని వెల్లడించింది. ఇదిలావుంటే  జూన్‌ 1 ‌నుంచి దేశ వ్యాప్తంగా 200 ప్రత్యేక రైళ్ల సర్వీసులు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో రైల్వే అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రిజర్వేషన్‌ ‌కన్‌ఫామ్‌ అయిన వారిని మాత్రమే స్టేషన్‌లోకి అనుమతిస్తామని, ప్రత్యేక ఎంట్రీ, ఎగ్జిట్‌ ఏర్పాటు చేస్తామని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌వో రాకేశ్‌ ‌చెబుతున్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా.. కొరోనా వ్యాప్తి చెందకుండా ప్రత్యేక చర్యలు చేపడతామని అంటున్నారు. రైలు ఆగే ప్రతి స్టేషన్‌లో టికెట్లు ఇచ్చేందుకు ఏర్పాటు చేశామన్నారు. ప్లాట్‌ ‌ఫామ్‌పై ప్రత్యేక మార్కింగ్‌లు ఏర్పాటు చేశామని రాకేశ్‌ ‌తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply