Take a fresh look at your lifestyle.

ఏ‌ప్రిల్‌ 14 ‌వరకూ లాక్‌డౌన్‌

  • ఒక్కరోజే 10 పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి
  • లాక్‌డౌన్‌, ‌కర్ఫ్యూ లేకుంటే భయంకర పరిస్థితులు
  • 20 వేల మంది హోం క్వారంటైన్‌లో
  • వ్యాధి ప్రబలితే చేపట్టాల్సిన చర్యలపై ప్రణాళికను సిద్ధం చేశాం
  • వ్యాప్తిని నిరోధించడమే వైరస్‌కు పెద్ద మందు
  • 1400 ఐసీయూ సహా 12,400 బెడ్లు సిద్ధంగా ఉన్నాయి
  • ఉన్నతస్థాయి సక్ష అనంతరం డియాతో సిఎం కెసిఆర్‌
  • ‌ప్రజలు ఇళ్లనుంచి బయటికి రాకపోవడమే శ్రీరామరక్ష

కొరోనా వైరస్‌ ‌వ్యాప్తి చెందకుండా ప్రస్తుతం అమలులో ఉన్న లాక్‌డౌన్‌, ‌కర్ఫ్యూను ఏప్రిల్‌ 14 ‌వరకూ పొడిగిస్తున్నట్లు సీఎం కె.చంద్రశేఖరారావు ప్రకటించారు. ఈ మహమ్మారి విస్తరిస్తున్న ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రాకపోవడమే శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 59 కొరోనా పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయనీ, శుక్రవారం ఒక్క రోజే 10 కొత్త కేసులు నమోదైనట్లు తెలిపారు. ప్రభుత్వం, పోలీసులు, వైద్యులను ప్రజలకు సహకరిస్తే సాధ్యమైనంత త్వరగా ఈ మహమ్మారి నుంచి బయటపడవచ్చని సూచించారు. వ్యాధి ప్రబలితే చేపట్టాల్సిన చర్యలపై ప్రణాళికను సిద్ధం చేశామని కావాల్సిన పరిస్థితి ఉందనీ, అన్ని వనరులు, సౌకర్యాలు ఉన్న అలాంటి దేశంలోనే ఆ పరిస్థితి ఆగమయ్యే విధంగా ఉందంటే మన దేశంలో పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవాలన్నారు. గుంపులు, గుంపులుగా రోడ్ల మీదకు రాకపోవడం, స్వీయ నియంత్రణ, పారిశుధ్యం పాటించడం మినహా మనకు మరో గత్యంతరం లేదని స్పష్టం చేశారు. అమెరికా, చైనా,స్పెయిన్‌, ఇటలీ స్థాయిలో వ్యాధి ప్రబలితే మన దేశంలో దాదాపు 20 కోట్ల మందికి కొరోనా వైరస్‌ ‌సోకే ప్రమాదం ఉందనీ, దీనికి ఎవరూ అతీతులు కారు, ఈ ఆపత్కాల సమయంలో ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటించడమే శ్రీరామరశ్రీ అని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 59 పాయిజిటీవ్‌ ‌కేసులో ఎక్కువగా విదేశాల నుంచి వచ్చినవారు వారి కుటుంబ సభ్యులు ఉన్నారని చెప్పారు. కొరోనా నివారణకు విజయ డయాగ్నస్ఠిక్స్, అపోలో కేంద్రప్రభుత్వ ఆధీనంలోని ఐసీఎమ్‌ఆర్‌ అనుమతిచిందని తెలిపారు.
రాష్ట్రంలో ఎట్లాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందనీ, అన్ని రకాలుగా అందుబాటులో ఉంటూ ఏ సహకారం అందించడానికై కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారని తెలిపారు.

రాష్ట్రంలో వైరస్‌ ‌ప్రబలి వ్యాధి తీవ్రత ఎక్కువైతే ఒక్కో దశలో 11 వేల మందిని ఉంచేలా, 1400 ఐసీయూలతో పాటు మొత్తం 12, 400 బెడ్లను సిద్ధం చేశామని సీఎం కేసీఆర్‌ ‌వెల్లడించారు. దీనికోసం ప్రస్తుతం 8 వేల మంది ప్రభుత్వ వైద్యులతో పాటు మరో 11 వేల మంది పదవీ విరమణ పొందిన ఎంబిబిఎస్‌ ‌వైద్యులు, ల్యాబ్‌ ‌టెక్నీషియన్లు, నర్సుల సేవలను వినియోగించుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో 60 వేల పాజిటివ్‌ ‌కేసులు నమోదైనా చికిత్స అందించేందుకు వీలుగా చర్యలు చేపట్టామనీ, పూర్తి స్థాయిలో వ్యాధి విజృంభించినా అన్ని రకాలుగా ఎదుర్కోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం కొరోనా అనే భయంకరమైన శత్రువుతో యుద్ధం చేస్తున్నామనీ, యుద్ధం చేసే సమయంలో నిర్లక్ష్యం అలసత్వం పనికిరాదనీ, వైద్యులు అధికారులలు, పోలీసులు, ప్రభుత్వానికి ప్రజలు సహకరించి శక్తి వృధా కాకుండా సహకరించాలని కోరారు. పరిస్థితి చేయి దాటిపోతే ఏమీ చేయలేమనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. తెలంగాణ సమాజానికి దండం పెట్టి చెబుతున్నా రాష్ట్రంలో ఉన్న వాళ్లందరికీ ఆహార వసతి ఏర్పాటు చేస్తాం ఎక్కడి వాళ్లు అక్కడే ఉండండి ఇతర రాష్ట్రాల ఉద్యోగులు, విద్యార్థులు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ హాస్టల్స్ ‌మూసి వేయొద్దని చెప్పాం ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పస్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 50 లక్షల ఎకరాల్లో పంటలు చేతికొచ్చే సమయమిదనీ, నాగార్జునసాగర్‌, ‌జూరాల ప్రాజెక్టుల కింద చివరి ఎకరాలో కూడా పంటలు పండే విధంగా సాగునీటిని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. బావులు, బోర్లపై ఆధారపడ్డ రైతులకు విద్యుత్‌ ‌సమస్యలు లేకుండా చూస్తామనీ, నిత్యావసర వస్తువుల కోసం ఇంటినుంచి ఒక్కరే వెళ్లాలనీ, ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులకు ఆహార సేవలు అందించి వైద్య సేవలు అందించాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చామని చెప్పారు. అలాగే, పశుగ్రాసం రవాణాకు అనుమతి ఉందనీ, చికెన్‌, ‌గుడ్లు వంటి బలవర్ధక పదార్థాలు తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందనీ, రైతు పండించిన ప్రతీ పంటనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని వెల్లడించారు. , రాష్ట్రంలో నివసించే ఏ వ్యక్తి అయినా మన రాష్ట్రానికి చెందిన వ్యక్తిగానే భావిస్తామనీ, నిరాశ్రయులకు ఆహార వసతి కల్పిస్తామని ఈసందర్భంగా సీఎం కేసీఆర్‌ ‌స్పష్టం చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply