Take a fresh look at your lifestyle.

ఏప్రిల్ 30 వరకు రాష్ట్రంలో లాక్ డౌన్..!

  • సామూహిక కార్యక్రమాలకు దూరంగా ఉండండి..
  • కొరోన వైరస్ విస్తరణ నివారణ చర్యల పై కేబినెట్ భేటీ
ఏప్రిల్ 30 వరకు రాష్ట్రంలో  కొనసాగించాలని రాష్ట్ర మండలి లో నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్య మంత్రి కేసీఆర్ మీడియా కు తెలిపారు. రాష్ట్రం లొ కొరోన పాజిటివ్   కేసులు  503 గుర్తించడం జరిగిందని..పొరుగు రాష్ట్రం మహారాష్ట్రా లో ఈ  ఒక్క రోజే 11 మంది మరణించారని..రాజస్థాన్ లొ 100 పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగించే విషయం అన్నారు. లాక్ డౌన్ కు సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియ జేస్తూ..విద్యా సంవత్సరం గురించి తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ.. ఒకటి నుంచి తొమ్మిదవ తరగతి వరకు పరీక్షలు రద్దు చేస్తున్నామని..పదవ తరగతి పరీక్షల పై రెండు,మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. వ్యవసాయ పనులకు లాక్ డౌన్ వర్తించదనీ తెలిపారు.
ఉదయం దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తో జరిగిన వీడియో సమావేశంలో కూడా లాక్ డౌన్ పొడిగించాలని కోరాననీ..రాష్ట్రానికి   క్యూ ఈ పద్దతి ద్వారా ఆర్థిక ప్యాకెజిలను కూడా ప్రకటించాలని కొరానని తెలిపారు. 203 లక్షల  కోట్లలో  జీడీపీ లో 5 శాతం రాష్ట్రానికి కేటాయించాలని సీ ఎమ్ కోరారు. రాష్ట్రాలు తీసుకున్న అప్పులను 6 నెలల వరకు వాయిదా వేయాలని కోరారు.మంత్రి మండలి సమావేశ తీర్మానాలను ప్రధాన మంత్రి కార్యాలయానికి పంపనున్నట్లు తెలిపారు.Pm letter to Kcr
Pm letter to Kcr

Leave a Reply