Take a fresh look at your lifestyle.

నేటితో ముగియనున్న.. లాక్‌డౌన్‌ ఆం‌క్షలు

  • దేశవ్యాప్తంగా రోజుకు 20 వేల కేసులు నమోదు
  • ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు

దేశంలో కొరోనా వైరస్‌ ‌కలకలం రేపుతోంది. రోజుకు 20వేల కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్రధాన నగరాలు కరోనా హాట్‌స్పాట్‌లు మారిపోతున్నాయి. చెన్నై, ఢిల్లీ, ముంబై, పుణెళి, హైదరాబాద్‌, అహ్మదాబాద్‌లలో కరోనా విలయం సృష్టిస్తోంది. దీంతో ఇప్పుడు దేశ వ్యాప్తంగా మళ్లీ లాక్‌డౌన్‌ ‌తప్పదన్న మాటలు వినిపిస్తున్నాయి. నిజానికి ఈ నెల 30తో అన్‌ ‌లాక్‌ 1. ‌ముగియనుంది. ఇప్పుడు కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందన్న చర్చ సాగుతోంది. మళ్లీ లాక్‌ ‌డౌన్‌ ‌వైపు మొగ్గు చూపుతుందా? అనేది ఆసక్తి రేపుతోంది. మరోవైపు ఆయా రాష్ట్రాలు మాత్రం సొంతంగా లాక్‌ ‌డౌన్‌ ‌విధించుకోవాలన్న దిశగా ఆలోచిస్తున్నాయి. ఎక్కడిక్కడ కేసులను బట్టి నిర్ణయాలు తీసుకుంటున్నారు.

దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతున్న వేళ మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, ‌కర్ణాటక, పశ్చిమ బెంగాల్‌ ‌వంటి రాష్ట్రాల్లో అత్యధిక సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు 15 వేలకు పైగా పెరగడం వరుసగా ఇది ఆరో రోజు. ఈ క్రమంలో పలు రాష్ట్రాలు మరో రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ ‌విధించే యోచనలో ఉన్నాయి. కరోనా కట్టడి కోసం మధ్యప్రదేశ్‌, ‌యూపీ రాష్టాల్లో్ర ఇంటింటి సర్వే నిర్వహించాలని నిర్ణయించగా.. గోవా, ఢిల్లీ, ఒడిశా వంటి రాష్టాల్రు, కేంద్ర పాలిత ప్రాంతాలు మరో రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ ‌విధించాలని భావిస్తున్నాయి. అస్సాం గువాహటిలో ఆదివారం నుంచి లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ‌ఠాక్రే కరోనా సంక్షోభం ఇంకా ముగియకపోవడంతో జూన్‌ 30 ‌తర్వాత కూడా ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

ఇప్పటికే తెలంగాణలో వైద్య అధికారులు మరో రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ ‌విధించాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సూచించిన సంగతి తెలిసిందే. దీనిపై రెండు మూడు రోజుల్లో నిర్ణయం వెలువడనుంది. కరోనా వ్యాప్తి కట్టడి కోసం పలు రాష్టాల్రు నూతన విధానాలను అమలు చేయనున్నాయి. ప్రస్తుతం భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య 5,28,859గా ఉండగా.. లక్షమందికి పైగా కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. రికవరీ రేటు 58.56 శాతం ఉన్నట్లు ప్రకటన విడుదల చేసింది. జూన్‌ 1 ‌నుంచి అన్‌లాక్‌.1 అమల్లోకి రావడం.. ఆంక్షలు సడలించడంతో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఫలితంగా జూన్‌ 1 ‌నుంచి దేశవ్యాప్తంగా 3,38,324 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ అన్‌లాక్‌ ‌కాలంలోనే ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని.. కరోనా నియమాలు పాటించడంలో అలసత్వం పనికిరాదని ప్రజలను హెచ్చరించారు. కరోనా విషయంలో అజాగ్రత్తగా ఉంటే మనతో పాటు ఇతరుల జీవితాలను కూడా ప్రమాదంలో పడేసినవాళ్లం అవుతామన్నారు. ’మన్‌కీ బాత్‌’ ‌కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ.. ’కరోనాను ఓడించడం.. దేశ ఆర్థికవ్యవస్థను బలోపేతం చేయడంపై ప్రస్తుతం ప్రజలు దృష్టి సారించాల్సి ఉంది. మాస్క్ ‌ధరించడం..

రెండు టర్ల దూరంతో పాటు ఇతర నిబంధనలను పాటించకపోతే.. మిమ్మల్ని, తో పాటు ఇతరులు.. ముఖ్యంగా కుంటుంబంలోని వృద్ధులు, పిల్లలను ప్రమాదంలో పడేసిన వారు అవుతారు’ అని హెచ్చరించారు. ఆర్థిక రాజధాని ముంబైలో ఆఫీసులకు, అత్యవసర వైద్య సేవలకు హాజరు కావడం తప్ప నగరవాసులు తమ ఇళ్ల నుంచి రెండు కిలోటర్లు దాటి వెళ్లవద్దని పోలీసులు కోరారు. రాష్ట్రంలో కంటైన్మెంట్‌ ‌జోన్లలో ఆంక్షల సడలింపుతో పాటు సెలూన్లు తెరవడానికి ప్రభుత్వం ఆదివారం అనుమతిచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో కేసులు భారీగా పెరగటంతో అధికారులు కొత్త వ్యూహాన్ని అమలు చేయనున్నారు. కంటైన్మెంట్‌ ‌జోన్ల సంఖ్యను 218 నుంచి 417 కి పెంచారు. కరోనా వ్యాప్తిని గుర్తించడం కోసం ఇంటింటి సర్వేలో భాగంగా కేవలం ఒక నెల రోజుల్లోనే సుమారు 2.45 లక్షల మంది ప్రజలను పరీక్షించారు. కరోనా కట్టడి కోసం ఇంటింటి సర్వే జూలై 6 వరకు పూర్తి కావాల్సి ఉండగా.. ఇప్పటికే 2 లక్షల మందిని పరీక్షించామని అధికారులు తెలిపారు. పల్స్ ‌పోలియో మాదిరిగానే ఇంటింటి సర్వే చేపట్టనున్నట్లు యూపి అధికారులు చెప్పారు. కంటైన్మెంట్‌, ‌నాన్‌ ‌కంటైన్మెంట్‌ ‌జోన్లలో కూడా సర్వే నిర్వహిస్తామన్నారు. 13,186 కేసులు నమోదైన మధ్యప్రదేశ్‌లో కరోనా వ్యాప్తిని నియంత్రించడానికి జూలై 1 నుంచి ’కిల్‌ ‌కరోనా’ ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దీనిలో భాగంగా ఇంటింటి సర్వే నిర్వహించబడుతుందని..ఇతర వ్యాధులపై కూడా పౌరులకు పరీక్షలు జరుపుతామని ముఖ్యమంత్రి శివరాజ్‌ ‌సింగ్‌ ‌చౌహాన్‌ ‌తెలిపారు. ఈ క్రమంలో కరోనా కట్టడి కోసం ప్రభుత్వం కమ్రూప్‌ ‌మెట్రోపాలిటన్‌ ‌జిల్లాలో మరోసారి పూర్తి లాక్‌డౌన్‌ ‌విధించింది. గువాహటి దీని కిందకే వస్తుంది. ఇక్కడ ఆదివారం రాత్రి 7 నుంచి జూలై 12 సాయంత్రం 6 గంటల వరకు లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుంది. కిరాణా, మాంసం, అన్ని ఇతర దుకాణాలు మూత పడతాయి. ఫార్మసీలు మాత్రమే పనిచేయడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది.

Leave a Reply