Take a fresh look at your lifestyle.

డ్రోన్ కెమెరా తో గద్వాల్ పట్టణంలో లాక్ డౌన్ పరిశీలన

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా గద్వాల్ పట్టణం లో లాక్ డౌన్ ను పక్కాగా అమలు చేసే నేపథ్యంలో జిల్లా ఎస్పీ శ్రీమతి కె. అపూర్వ రావు IPS ఆదేశాల మేరకు పోలీస్ సిబ్బంది బుధ వారం భీమ్ నగర్, ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ కాలనీ, రాధా కృష్ణ కాలనీ, వేద నగర్, ప్రాంతాలను డ్రోన్ కెమెరా తో పర్యవేక్షించారు. కాలనిలలో ఎవరైనా ప్రజలు గుమి కూడరా , లేదా చిన్న చిన్న వీధులలో లాక్ డౌన్ ను పాటిస్తున్నారా లేదా అలాగే నిత్యావసర కేంద్రాల దగ్గర సామాజిక దూరం ను పటిస్తున్నారా అనే విషయాలను డ్రోన్ కెమెరా ను ఉపయోగించి తెలుసుకొని వెంటనే తదుపరి చర్యలు చేపట్టేందుకు కెమెరాలను ప్రయోగిస్తున్నారు.

ఈ కెమెరా ద్వారా లైవ్ మానిటరింగ్ చేసి ఎక్కడైతే ప్రజలు అనవసరంగా ఉన్నారో వాళ్ళని పోలీసులు అదుపులోకి తీసుకొనే అవకాశం ఉంటుంది. రోడ్ల మీద అనవసరంగా గుమిగూడి ఉంటున్న వారి పైన పోలీసులు కేసులు కూడా నమోదు చేస్తున్నారు.గద్వాల్ పట్టణం లో ఈ రోజు ఒక రేషన్ షాప్ దగ్గర లాక్ డౌన్ నియమాలను అనుసరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ సర్కిల్ లో నిలబడిన ఫోటోను చూడవచ్చు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply