రెండో దశ లాక్ డౌన్ పై కేంద్రం గైడ్ లైన్స్…. Breaking News By PrajatantraDesk On Apr 15, 2020 2:05 pm 172 ఏప్రిల్ 20 నుండి మే 3 వరకు కొనసాగుతుంది. రెండో దశ లాక్ డౌన్ పై కేంద్రం సూచనలు. *మతపరమైన కార్యక్రమాలు చేపడితే కఠిన చర్యలు *రాష్ట్రాల మధ్య అన్ని రకాల రవాణా లు బంద్. *బయటకు వస్తే మాస్కులు తప్పని సరి. *ఏప్రిల్ 20 తర్వాత హాట్స్పాట్ కానీ ప్రాంతాల్లో సడలింపు. *రోడ్లపై, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం నిషేధం. * ఉపాధి హామీ పనులు కొనసాగుతాయి. *రోడ్లు, రైలు, వాయు మార్గాలు బంద్. * హాట్ స్పాట్ లో కఠిన నిబంధనలు. హాట్స్పాట్ లలో నిబంధనలు అతిక్రమిస్తే వారిపై చర్యలు * అంత్యక్రియలు ఇతర కార్యక్రమాల్లో 20 మందికి మాత్రమే అనుమతి. *ఆన్లైన్ షాపింగ్ ఇ-కామర్స్ లకు అనుమతి. *హాట్ స్పాట్ లో జనం బయటకు రాకూడదు. బయటకు వస్తే బైక్ సీజ్ చేయడంతోపాటు అట్టి వ్యక్తి పై చట్టపరమైన చర్యలు తీసుకోబడును. * సినిమా హాల్స్ షాపింగ్ మాల్స్, ఎంటర్టైన్మెంట్, బహిరంగ సభలు పూర్తిగా బంద్. * వ్యవసాయం. అనుబంధ రంగాలకు అనుమతి. *గ్రామీణ ప్రాంతాలలో పరిశ్రమలకు అనుమతి. * స్విమ్మింగ్ పూల్స్, పార్కులు, ఆడిటోరియంలు, షాపింగ్ మాల్స్ జింస్, స్టోర్స్, బార్లు, పూర్తిగా మూసివేయాలి. * పెట్రోల్, డీజిల్, కిరోసిన్, సిఎన్జి రవాణాకు అనుమతి. *విద్యా సంస్థలు పూర్తిగా మూసి వేయాలి. * హాట్స్పాట్ కేంద్రాలపై రాష్ట్రాలు ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. *అన్ని మత పరమైన ప్రార్థన మందిరాలను మూసివేయాలని కేంద్రం సూచన. *అన్ని హెల్త్ సర్వీసులు కొనసాగించాలని కేంద్రం నిర్ణయం. *ఉపాధి హామీ పథకంలో సోషల్ డిస్టెన్స్ తప్పకుండా పాటించాలని రాష్ట్రాలకు పిలుపునిచ్చిన కేంద్రం. Share this:WhatsAppFacebookTelegramTwitterTumblr Related lockdown latest updates