కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా మార్గదర్శకాలను ప్రకటిస్తుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తెలిపారు. బుధవారం కేంద్ర కేబినెట్ సెక్రటరీ రాజీవ్‌గౌబ వివిధ రాష్టాల్ర చీఫ్ సక్రటరీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్ సోమేశ్‌కుమార్ తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్నచర్యలను వివరించారు.
ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విషయంలో సవరించిన ప్రత్యేక మార్గదర్శకాలను ప్రకటించిందని, ఏప్రిల్ 20 తర్వాత దీనిని అమలులోకి తీసుకు వస్తామన్నారు. అలాగే కరోనా వైరస్ నివారణకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చీఫ్ సెక్రటరీ ప్రభుత్వం కరోనా విషయంలో కఠినంగా వ్యవహరిస్తోందన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు