Take a fresh look at your lifestyle.

పరిశీలన లో లాక్ డౌన్ పొడిగింపు అంశం..!

  • వివిధ రాష్ట్రాలు, నిపుణుల నుంచి లాక్ డౌన్ అంశంపై సూచనలు వస్తున్నాయి- కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి

కొరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ పొడిగింపు అంశాన్ని పరిశీలిస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.ఢిల్లీలో, మంత్రి మీడియా ప్రతి నిధులతో మాట్లాడుతూ, వివిధ రాష్ట్రాలు, నిపుణులు దీనికి సంబంధించిన సూచనలు చేస్తున్నారని, తెలిపారు. “ప్రజలు లాక్‌డౌన్‌కు సహకరించాలని చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దు. అనవసర కారణాలతో రోడ్డపై తిరగొద్దు. ప్రతిరోజు తాజా కూరగాయల కోసం ప్రజలు ఇళ్లనుండి బయటకు రావద్దు, వారానికి సరిపడా కూరగాయలు, నిత్యావసర వస్తువులను ఒకేసారి తెచ్చుకోవాలని” కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేసారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకునే, కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ అమలు చేస్తోంది, విదేశాల నుండి వచ్చి ఢిల్లీలో క్వారైంటైన్ పూర్తి చేసుకున్న వారిని ప్రస్తుత పరిస్థితులలో వారి స్వస్థలాలకు తరలించడం సాధ్యం కాదు. వారికి క్వారైంటైన్ సెంటర్ లోనే లాక్ డౌన్ కొనసాగినన్ని రోజులు ఆహారం, వసతి సదుపాయాలు అందిస్తాం.

వారి తల్లితండ్రులు ఈ విషయాన్ని అర్ధం చేసుకోవాలి. వారి క్షేమం పట్ల ఆందోళన చెందవద్దు, అని కిషన్ రెడ్డి తెలిపారు. లాక్ డౌన్ పొడగింపుపై అందరి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు స్వీకరించిన తరువాత ప్రధాని నిర్ణయం తీసుకుంటారు అని తెలిపారు. దేశంలో టెస్టింగ్‌ కిట్ల కొరతలేదు అని కిషన్ రెడ్డి చెప్పారు. బుధవారం రెండు లక్షల కిట్లు వచ్చాయి. ఆరేళ్లుగా కేంద్రం ఒక్క రూపాయికూడా దుర్వినియోగం చెయ్యలేదు. ప్రతిపక్షాల సూచనలు కూడా స్వీకరిస్తాం అని మంత్రి కిషన్‌రెడ్డి వివరించారు. నిన్న జరిగిన మంత్రుల బృందం సమావేశంలో లాక్ డౌన ను మరింత కఠినంగా అమలు చేయాలని నిర్ణయించాం. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించే ప్రసక్తి లేదు, అని మంత్రి స్పష్టం చేశారు.ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్, 1955 లోని నిబంధనలను అమలు చేయడం ద్వారా, అన్ని అవసరమైన వస్తువుల లభ్యతను నిర్ధారించాలని ఎసెన్షియల్ కమోడిటీస్హోర్డింగ్ బ్లాక్ మార్కెటింగ్‌ను నివారించాలని హోంశాఖ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది అని తెలిపారు.

Leave a Reply