- గ్రీన్ జోన్లలో దుకాణాలు తెరచి ఉంచడానికి అనుమతి
- అంతర్రాష్ట బస్సులు, క్యాబ్‌లకూ అనుమతి
- శనివారం జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం
కొరోనా నియంత్రణకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొనసాగిస్తున్న లాక్‌డౌన్‌ను మరో రెండు వారాల పాటు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయిం తీసుకుంది. ఈమేరకు మే 4 నుంచి మరో రెండు వారాల పాటు లాక్డౌన్ అమలులో ఉండనుంది. మరో రెండు రోజుల్లో లాక్డౌన్ గడువు ముగియనుండగా, శుక్రవారం న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన అత్యున్నత స్థాయి సమావేశంలో ఈ పొడిగింపు నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఇప్పటికే ప్రకటించిన గ్రీన్జోన్లలో బస్సులు యధావిధిగా తిరుగుతాయి. దీంతో పాటు దుకాణాలు తెరుచుకోవడానికి అనుమతిస్తారు. కేంద్రం తాజా నిర్ణయం ప్రకారం గ్రీన్జోన్లలో ఉదయం 7 నుంచి సాయంత్రం 7 గంటల వరకు అన్ని దుకాణాలు తెరుచుకోవడానికి అవకాశం ఇస్తారు.
గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఒక జిల్లా నుంచి మరో జోన్ల పరిధిలో కూడా బస్సుల్లో వెళితే 50 శాతం మాత్రమే నిండి ఉండాలి. అంతర్ట్రా జోన్లలో బస్సులు తిరగడానికి అనుమతి ఉంటుంది. అలాగే, క్యాబ్‌లు తిరగవచ్చు. అలాగే, కారులో డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తి, టూ వీలర్‌పై ఒకే వ్యక్తి ప్రయాణించాలి. ఇక ప్రార్థనా స్థలాల్లో సామూహిక ప్రార్థనలను అనుమతించరు. అలాగే, రెడ్ జోన్లలోనూ ఆసుపత్రులో ఓపి సేవలను కొనసాగించుకోవచ్చు. హోటళ్లు, రెస్టారెంట్లు, జిమ్ములు, సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవడానికి అనుమతించరు. కాగా, కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మరో రెండు వారాల పాటు పొడిగించినప్పటికీ గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ప్రస్తుతం ఉన్న నిబంధనలను చాలా వరకు ఎత్తివేయడం విశేషం.