Take a fresh look at your lifestyle.

మామిడి రైతుల నోట్లో మట్టి కొట్టిన లాక్‌ ‌డౌన్‌

aruna
అరుణ ,జర్నలిస్టు ,న్యూ దిల్లీ

అమ్రాస్‌’ అనే తీపి వంటకం మామిడి రైతును ఏడిపిస్తున్నది. ఈ సీజన్‌లో మామిడిపండ్ల రైతులను లాక్‌డౌన్‌ ఇబ్బందులకు గురిచేసింది. దీనికి మూలాలు ఎక్కడున్నాయి అని వెదికితే గుజరాత్‌ ‌మార్కెట్‌లో దొరుకుతున్నాయి. గుజరాత్‌లోని కేజర్‌ ‌ప్రాంతం మామిడి పండ్ల అతి పెద్ద టోకు మార్కెట్‌. ‌సాధారణంగా ఈ సమయంలో ఈ మార్కెట్‌ ‌సందడిగా ఉంటుంది. ఇప్పుడు ఈ మార్కెట్‌ ఎడారి లాగా ఉంది. ఈ మార్కెట్‌ ‌సందడికి ప్రధాన కారణం అమ్రాస్‌. అ‌మ్రాస్‌ అం‌టే భారతీయ ఉపఖండంలో వేసవిలో చేసుకునే ఓ తీపి వంటకం. ఇది బాగా పండిన మామిడి పండ్ల గుజ్జు నుండి తయారవుతుంది. పేదలు బాగా పండిన మామిడి పళ్ళను చేతితో పిసికేసి అటుపై చపాతీ నంచుకుని తింటారు. ధనికులు ఇదే మామిడి గుజ్జులో రుచిని పెంచడానికి చక్కెర, నెయ్యి, లేదా పాలు కలుపుతారు. ఇక అమ్రాస్‌ ‌వేడుకలు మరాఠ, గుజరాతీ, రాజస్థాన్‌, ‌మార్వారి గృహాలలో జరుపుకుంటారు. అమ్రాస్‌ ‌వేసవిలో జరిగి ప్రాంతీయ పండుగలలో ప్రసిద్ధ డెజర్ట్. ‌ప్రస్తుతం ఈ వేసవిలో దేశవ్యాప్తంగా లాక్డౌన్‌ ‌కొనసాగుతున్నది. దీనితో పండ్ల రాజు మామిడికి గ్రహణం పట్టింది.

దీనితో మామిడి పండించిన రైతు కుదేలు అవుతున్నాడు. ఉద్యానవన శాఖ అధికారుల ప్రకారం, రుతుపవనాల వలన పంట రావటానికి ఈ సారి కొంత ఆలస్యం అయ్యింది. అక్టోబర్‌ ‌వరకు వర్షం కురిసింది…డిసెంబర్‌-‌జనవరికి బదులుగా ఫిబ్రవరి-మార్చిలో మామిడి పిందే పుష్పించింది. రెండు వారాల ఆలస్యంతో మామిడి పిందే పుష్పించింది. ప్రస్తుతం మామిడి పండు మంచిగా పండి అమ్రాస్‌కి అనుకూలంగా వుంది. మే నెలలో మామిడి పండు మార్కెట్లో రాజ్యం ఎలాల్సి ఉండగా లాక్‌ ‌డౌన్‌ ‌మామిడి పండుకు బ్రేక్‌ ‌వేసింది. దేశవ్యాపితముగా  మొత్తం మామిడి పళ్ళ ఉత్పత్తులను అమ్మడానికి ఒక నెల సమయం చాలా ముఖ్యమైనది. ఈ సమయం లాక్‌ ‌డౌన్‌ ‌తినేసింది. జూన్‌ ‌మధ్య నుండి వర్షం పడటం మొదలు అయితే మామిడి ధరలు ఇంకా పడిపోతాయని అగ్రికల్చర్‌ ‌ప్రొడ్యూస్‌ ‌మార్కెట్‌ ‌కమిటీ చెబుతున్నది. మామిడి పళ్ళు చేతులారా పెంచిన రైతుల నోటిలో ఈ సారి లాక్‌ ‌డౌన్‌ ‌మట్టి కొట్టింది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!