Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో అవసరాన్ని బట్టి లాక్‌డౌన్‌

‘ఆస్క్ ‌కెటిఆర్‌’ ‌కార్యకమ్రంలో మంత్రి కేటీఆర్‌ ‌సమాధానం

ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌జనవరి 14 : కొరోనా మళ్లీ భారత్‌ను వణికిస్తున్న సమయంలో తెలంగాణలోనూ పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నా.. ఇప్పటి వరకు సాధారణ కోవిడ్‌ ‌నిబంధనలు తప్పితే..అదనంగా ఎలాంటి ఆంక్షలు లేవు. అయితే, దీనిపై మంత్రి కేటీఆర్‌ను ప్రశ్నించారు నెటిజన్లు.. ట్విట్టర్‌లో మరోసారి ‘ఆస్క్ ‌కేటీఆర్‌’ ‌కార్యక్రమం నిర్వహించారు. రాజకీయ, అభివృద్ధి, తదితర అంశాలపై నెటిజన్ల ట్వీట్లపై కేటీఆర్‌ ‌స్పందించారు. లాక్‌డౌన్‌, ‌నైట్‌ ‌కర్ఫ్యూపై కూడా మంత్రి కేటీఆర్‌కు ప్రశ్నలు ఎదురయ్యాయి..దీనిపై స్పందించిన ఆయన.. కొరోనా కేసులు, వైద్యారోగ్య శాఖ సలహాల మేరకు.. రాష్ట్రంలో లాక్‌డౌన్‌, ‌రాత్రి కర్ఫ్యూ వంటి నిర్ణయాలు ఉంటాయని వెల్లడించారు.. అయితే, ప్రస్తుతం కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ ‌లాంటి ఆలోచనలు మాత్రం ప్రభుత్వం లేనట్టుగా తెలుస్తుంది. కేసుల సంఖ్య మరింతగా పెరిగితే.. కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంటున్నారు.

కేసులు పెరుగుతూ పోతున్నందున..సంక్రాంతి హాలీడేస్‌ ‌తర్వాత స్కూళ్లు, కాలేజీలు, విద్యాసంస్థలు తెరుచుకుంటాయా? లేదా? అనేదానిపై ప్రభుత్వమే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇకపోతే తమ సుస్థిర, సుపరిపాలనే భాజపా విద్వేష ప్రచారానికి తమ సమాధాన మని కేటీఆర్‌ అన్నారు. భాజపా విషపూరిత అజెండాను రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటారని.. తెలంగాణ కోసం ఎవరు పనిచేస్తున్నారో తెలుసన్నారు. పలు అంశాలపై బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. ఇక, అనేక అంశాలపై ప్రశ్నలు సంధించారు నెటిజన్లు..యూపీలో బీజేపీకి వ్యతిరేకంగా, సమాజ్‌ ‌వాదీకి మద్దతుగా ప్రచారంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఓ ప్రశ్నకు బదులిచ్చారు.

Leave a Reply