Take a fresh look at your lifestyle.

లాక్‌డౌన్‌ ‌నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

  • జీహెచ్‌ఎం‌సి పరిధిలో వైరస్‌ ‌నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ

రాష్ట్రంలో కొరోనా వ్యాధి ప్రబలకుంగా పకడ్బందీ చర్యలు తీసుకోవాలనీ, కంటైన్మెంట్‌ ‌ప్రాంతాలలో లాక్‌డౌన్‌ ‌నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, ఈటల రాజేందర్‌ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంగా హైదరాబాద్‌ ‌నగరంలో గుర్తించిన ప్రాంతాలలో ప్రజలు 100 శాతం లాక్‌డౌన్‌ ‌పాటించాలనీ, పూర్తిగా అన్ని రహదారులను మూసివేసి ఏ ఒక్కరినీ బయటికి రాకుండా కట్టడి చేయాలని సూచించారు. జీహెచ్‌ఎం‌సి పరిధిలో కొరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు మంగళవారం మంత్రి కేటీఆర్‌ ‌క్యాంపు కార్యాలయంలో మంత్రి ఈటల రాజేందర్‌, ‌ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ ‌కుమార్‌, ‌డీజీపీ మహేందర్‌ ‌రెడ్డి, మేయర్‌ ‌బొంతు రామ్మోహన్‌, ‌మున్సిపల్‌ ‌శాఖ ప్రత్యేక కార్యదర్శి అర్వింద్‌ ‌కుమార్‌, ‌వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

అనంతరం మంత్రి కేటీఆర్‌ ‌మాట్లాడుతూ మే 3 వరకూ లాక్‌డౌన్‌ ‌పొడించామనీ, వైరస్‌ ‌వ్యాప్తి నివారణకు ఇదొక్కటే మార్గమని స్పష్టం చేశారు. సమావేశంలో మంత్రి ఈటల రాజేందర్‌ ‌మాట్లాడుతూ రాబోయే 10 రోజులు చాలా కీలకమనీ, ఎవరు కూడా అనవసరంగా రోడ్లపైకి రావొద్దని హెచ్చరించారు. ముఖ్యంగా హైదరాబాద్‌ ‌నగరంలోని గుర్తించిన ప్రాంతాలలో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలనీ, అవసరమైన అంబులెన్సులను అందుబాటులో ఉంచుకోవాలనీ, ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే అటువంటి అనుమానితులను వెంటనే ఆసుపత్రికి పంపించాలన్నారు. ఎవరికైనా అనుమానితులు లేదా వైద్య సేవలు కావాలంటే 104 లేదా జీహెచ్‌ఎం‌సిలోని 040 21111111 నంబరుకు కాల్‌ ‌చేసి సహాయం పొందవచ్చని తెలిపారు. సమావేశంలో సీఎస్‌ ‌సోమేశ్‌ ‌కుమార్‌ ‌మాట్లాడుతూ జీహెచ్‌ఎం‌సి పరిధిలో పోలీసు, మెడికల్‌, ‌మున్సిపల్‌ అధికారులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!