పట్టణ కేంద్రంలో మహిళకు కరోనా పాస్టీవ్ రావడంతో నాలుగు రోజులపాటు బందు పాటించాలని గ్రామపంచాయితీ నిర్ణహించడంతో మొదటి రోజు దుకాణా దారులు స్వచ్చందంగా బంద్ పాటిస్తున్నారు. కరోనా పాసిటీవ్ వచ్చిన మహిళను చుట్టుప్రక్కల ప్రజలు పరామర్శించడంతో కాలనీలోని 70మందిని హోం క్వారంటైన్లో ఉంచారని అధికారులు తెలిపారు.
దీంతో పట్టణ ప్రాంతమంతా నిర్మానుష్యంగా మారింది. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేకుండా బయటికి వచ్చి ప్రాణాలమీదకి తెచ్చుకోవద్దని స్థానిక తహశీల్దార్ శ్రీవాసకుమార్ ప్రజలను కోరారు. అత్యవసరం అయితే తప్ప ఎవరు బయటకు రావద్దని, తప్పనిసరిగా మాస్క్లు ధరించాలని కోరారు. సామాజిక దూరం పాటించి కరోనాను కట్టడి చేయాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.