Take a fresh look at your lifestyle.

మే3 వరకు లాక్‌డౌన్‌ ‌పొడిగింపు

  • మరో 19 రోజుల పాటు లాక్‌డౌన్‌లోనే  దేశం
  • దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ ‌విస్తరిస్తున్న వేళ పొడిగింపు
  • కరోనాపై పోరులో ప్రజలు సైనికుల్లా పనిచేస్తున్నారు
  • ఆంక్షల కారణంగానే ప్రపంచ దేశాలతో పోలిస్తే మనం బెటర్‌గా ఉన్నాం
  • ప్రజల ప్రాణాలే ముఖ్యం..ఇంటిపట్టున ఉండి ఆరోగ్యం పెంచుకోండి
  • జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోడీ

లాక్‌డౌన్‌ ‌పొడిగింపుపై అందరూ ఊహించినట్టే జరిగింది. కొవిడ్‌-19‌ను కట్టడి చేసేందుకు లాక్‌డౌన్‌ ‌పొడిగించాలంటూ పలు రాష్టాల్ర ముఖ్యమంత్రులు చేసిన డిమాండ్‌ను కేంద్రం పరిగణనలోకి తీసుకుంది. మే 3 వరకు లాక్‌డౌన్‌ ‌పొడిగిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రకటించారు. దీంతో మరో 19 రోజుల పాటు దేశం లాక్‌డౌన్‌లోనే కొనసాగనుంది. అలాగే సప్త సూత్రాలను వెల్లడించి వాటిన ఇపాటించాలన్నారు. ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ మేరకు ప్రకటించారు. దీంతో అంతా ఊహించినట్లుగానే మే 3వ తేది వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇప్పటి వరకు దేశ ప్రజలు లాక్‌డౌన్‌ అమలు కోసం సహకరించినందుకు శిరసు వంచి నమస్కరిస్తున్నానంటూ ప్రధాని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఇదే సందర్భంలో పేదలకు అన్నం పెట్టి ఆదరించాలని, ఎవరిని కూడా ఉద్యోగాల నుంచి తొలగించ వద్దని కీలక సూచన చేశారు. ఎవరు కూడా ఆకలితో అలమటించకుండా ఏర్పాటు చేశామన్నారు. దేశంలో ఆహర, మందుల నిల్వలకు కొదవ లేదన్నారు. కరోనా వైరస్‌ ‌దేశ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోన్న వేళ లాక్‌డౌన్‌ ‌కష్టాలు తట్టుకుని ప్రతిఒక్కరూ దేశాన్ని కాపాడుకుంటున్నారు. దేశ ప్రజలు ఎన్నికష్టాలు ఎదుర్కొంటున్నారో నేను అర్థం చేసుకోగలను. దేశం కోసం ప్రజలు సైనికుల్లా పనిచేస్తున్నారు. కరోనాపై పోరాటానికి ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారు. కరోనాపై భారత్‌ ‌బలంగా పోరాడుతోంది. ప్రజలు ఎన్నో కష్టాలు పడి భారత్‌ను రక్షించారు. కరోనాపై పోరాటంలో దేశం మొత్తం ఒక్కతాటిపై ఉంది. అందుకు దేశ ప్రజలకు ధన్యవాదాలని ప్రధాని తన ప్రసంగంలో పేర్కొన్నారు.

Leave a Reply