Take a fresh look at your lifestyle.

లాక్‌డౌన్‌ ‌పొడిగింపు కొరోనా కట్టడికి మరో గత్యంతరం లేదు

  • లాక్‌డౌన్‌, ‌రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సుదీర్ఘ చర్చ 

కొరోనా వైరస్‌ ‌కట్టడికి ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న లాక్‌డౌన్‌ను మరో రెండు వారాల పాటు పొడిగించాలని మంత్రిమండలి సమావేశం నిర్ణయించింది. ఈనెల 12తో లాక్‌డౌన్‌ ‌గడువు ముగుస్తున్నందున వైరస్‌ ‌నియంత్రణకు లాక్‌డౌన్‌ ‌కొనసాగింపు మినహా గత్యంతరం లేదని అభిప్రాయ పడింది. శనివారం  ప్రగతిభవన్‌లో సీఎం కె.చంద్రశేఖరావు అధ్యక్షతన రాష్ట్రమంత్రివర్గ సమావేశం దాదాపు నాలుగు గంటల పాటు కొనసాగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో మూడు వారాలుగా లాక్‌డౌన్‌ అమలవుతున్న నేపథ్యంలో ఏర్పడ్డ పరిస్థితిపై చర్చించారు. వైరస్‌ ‌వ్యాప్తి ప్రస్తుతానికి అదుపులోనే ఉన్నప్పటికీ ఇప్పుడే లాక్‌డౌన్‌ ఎత్తివేస్తే పరిస్థితి అదుపుతప్పుతుందన్న నిర్ణయానికి మంత్రివర్గం వచ్చింది. అలాగే, శనివారం ఉదయం ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల సీఎంలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సందర్భంగా చర్చకు వచ్చిన అంశాలను సీఎం కేసీఆర్‌ ‌మంత్రివర్గ సమావేశంలో వివరించారు.

రాష్ట్రంలో వ్యవసాయ పంటల కొనుగోళ్లు, ఆర్థిక పరిస్థితి ప్రభావం, ప్రజలకు నిత్యావసర వస్తువుల పంపిణీ తదితర అంశాలపై సైతం మంత్రివర్గ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. లాక్‌డౌన్‌ ‌నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం పడిందనీ, అయినప్పటికీ ప్రజల ప్రాణాలు కాపాడాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమైనందున ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ లాక్‌డౌన్‌ను కొనసాగించాలనే నిర్ణయం తీసుకున్నారు. అలాగే, వ్యవసాయ విధానంపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలనీ, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిత్యావసర సరుకులను మరింత పకడ్బందీగా నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే, ఇటీవల రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఏ విధంగా ఆదుకోవాలనే విషయంపై సైతం మంత్రివర్గ సమావేశంలో చర్చించారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!