Take a fresh look at your lifestyle.

నిబంధనలు పాటించకుంటే మరోమారు లాక్‌డౌన్‌

‘‌మహా’లో పెరుగుతున్న కేసులపై ఆందోళన
ప్రజలను హెచ్చరించిన సిఎం ఉద్దవ్‌

‌రాష్ట్రంలో కొవిడ్‌-19 ‌నిబంధనలు పాటించకుంటే తిరిగి లాక్‌డౌన్‌ను విధించాల్సి వస్తుందని మహారాష్ట్ర సీఎం
ఉద్ధవ్‌ ‌ఠాక్రే  ప్రజలను హెచ్చరించారు. కరోనా మహమ్మారి ఉద్ధృతిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టిందన్నారు. సడలింపులు ముప్పుగా మారాయని తేలితే మరోసారి లాక్‌డౌన్‌ ‌విధిస్తామని స్పష్టం చేశారు. ప్రజలంతా పరిస్థతిని గమనించి, దయచేసి సామాజిక దూరం పాటించాలని ఆయన ట్విట్టర్‌ ‌ద్వారా విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను దశలవారీగా విధించడంతోపాటు దశలవారీగా ఎత్తివేస్తున్నామని ఠాక్రే పేర్కొన్నారు.  ప్రమాదం ఇంకా తీవ్రస్థాయిలోనే  ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనాతో పోరాడుతూ ఆర్థిక వ్యవస్థనూ గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. తామెప్పుడు ప్రజల ప్రయోజనం కోసమే పనిచేస్తున్నామని, ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకుని సహకరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకూ మహారాష్ట్రలో 94,041 కరోనా పాజిటివ్‌ ‌కేసులు నమోదు కాగా, 3,438 మంది మరణించారు. 44,517 మంది కోలుకున్నారు. ఇదిలా ఉండగా నిసర్గ తుఫాన్‌ ‌కూడా రాష్టాన్ని్ర అతలాకుతలం చేసిందన్నారు. విద్యుత్‌ ‌వ్యవస్థ దెబ్బతిన్నదని, భారీ సంఖ్యలో సాంకేతిక నిపుణులను ఉపయోగించి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply