Take a fresh look at your lifestyle.

లాక్‌డౌన్‌ 3.0 ‌తప్పదా..?

కొరోనా వైరస్‌ ‌కేసుల సంఖ్య ఇంకా, ఆశించిన స్థాయిలో నియంత్రణలోకి రాకపోవడంతో దేశవ్యాప్తంగా మరోసారి లాక్‌డౌన్‌ ‌పొడిగింపు అనివార్యంగా కనిపిస్తోంది. కొరోనా వ్యాప్తి కట్టడి, లాక్‌డౌన్‌ అమలు జరుగుతున్న తీరు ఆంక్షల కొనసాగింపు, సడలింపు తదితర అంశాలపై ప్రస్తుతం ప్రధాని నరేంద్రమోదీ అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ‌నిర్వహించారు.లాక్‌డౌన్‌ ‌నేపథ్యంలో రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితిలను మోదీ అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం దేశంలో మే 3 వరకూ లాక్‌డౌన్‌ ‌కొనసాగుతుంది. అయితే ఆ తరువాత లాక్‌డౌన్‌ ‌కొనసాగించాలా? వద్దా? ఒక వేళ కొనసాగించని పక్షంలో యధాతథంగా అమలు చేయాలా? లేక ఏమైనా మినహయింపులు ఇవ్వాలా? అనే అంశంపై మోదీ అన్నీ రాష్ట్రాల సీఎంల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఒకవేళ లాక్‌డౌన్‌ ఎత్తివేస్తే అనంతరం తలెత్తే పరిణామాలపై ఎలాంటి వ్యూహాలను అమలు చేయాలనే అంశం సైతం పీఎం సీఎంలతో చర్చిస్తున్నారు.

మరోవైపు రోజురోజుకు కొరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఆందోళన చెందుతున్న అనేక రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ను కొనసాగించాలా? కేంద్రాన్ని కోరుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రాంలో లాక్‌డౌన్‌ ‌మే 7 వరకూ కొనసాగించనున్నట్లు సీఎం కేసీఆర్‌ ‌స్పష్టం చేశారు. అయితే గత రెండు రోజులుగా రాష్ట్రంలో కొరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధానితో వీడియో కాన్ఫరేన్స్‌లో సీఎం కేసీఆర్‌ ఏం ‌చెబుతారు అనే విషయంపై రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే తెలంగాణలో కొత్తకేసు తగ్గుముఖం పట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడానికి కారణం క్షేత్రస్థాయిలో కేసులు లేకపోవడమే ప్రధాన కారణం. పరీక్షల సంఖ్య గణనీయంగా తగ్గించడమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో ఏప్రిల్‌ 26 ‌నాటికి18,514 పరీక్షలు చేయగా 990 పాజిటివ్‌గా అయ్యాయి. అదే పక్కరాష్ట్రం ఏపీలో 61,266 మందికి కొరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

ఏప్రిల్‌ 27‌నాటికి తెలంగాణలో 18756 పరీక్షలు నిర్వహించగా 1001 పాజిటివ్‌ ఏపీలో 68,034 పరీక్షలు నిర్వహించగా 1097 పాజిటివ్‌ ‌కేసులు నమోదు అయ్యాయి.అంటే ఒక్క రోజులో తెలంగాణ ప్రభుత్వం 242 అదనపు పరీక్షలు నిర్వహించగా ఏపీలో 6768 పరీక్షలు నిర్వ హించారు. ఏపీ స్థాయిలో తెలంగాణ కూడా పరీక్షలు నిర్వహించి ఉంటే 6768/242x =307 అదే ఏపీతో పోలిస్తే 3.80 రెట్లు ఎక్కువ. కానీ మనం పరీక్షలు తగ్గించి కేసుల సంఖ్యను కూడా భారీగా తగ్గించగలుగుతున్నాం. పరీక్షలు సంఖ్య పెంచితే కేసుల సంఖ్య కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో కేసులు తగ్గుముఖం పట్టాయా? ప్రజలు అజాగ్రత్తగా ఉండే ప్రమాదం కూడా ఉంది. దీంతో కొరోనా మరింత వ్యాప్తిచెందే అవకాశం ఉంది.పరీక్షలు తగ్గించడం సరికాదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొరోనా పరీక్షల సంఖ్యను పెంచకుండా వ్యాపించకుండా ఈ మహమ్మారిని అదుపు చేయడం సాధ్యం కాదనీ ట్రెస్‌.‌టెస్ట్-‌ట్రాట్‌ ‌పంథా ఒక్కటే మార్గమా? డబ్ల్యూహెచ్ఒ ‌పదేపదే చెబుతున్నది. తెలంగాణ ఈ దిశగా చర్యలు చేపట్టా)ని తెలంగాణ జయింట్‌ ‌యాక్షన్‌ ‌కమిటీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!