Take a fresh look at your lifestyle.

జూన్‌ 19 ‌వరకు లాక్‌ ‌డౌన్‌

  • ‌సడలింపు సాయంత్రం 5 గంటల వరకు పొడిగింపు
  • ఇళ్లకు చేరడానికి మరో గంట వెసులుబాటు
  • కొత్త రేషన్‌ ‌కార్డుల జారీకి కేబినేట్‌ ఆమోదం
  • 9 పాత జిల్లాలలో స్పెషల్‌ ‌ఫుడ్‌ ‌ప్రోసెసింగ్‌ ‌జోన్లు ఏర్పాటు
  • అత్యుత్తమ వైద్య సేవలపై అధ్యయనానికి మంత్రి హరీష్‌ ‌రావు అధ్యక్షతన కేబినెట్‌ ‌సబ్‌ ‌కమిటీ
  • రాష్ట్ర కేబినెట్‌ ‌సమావేశంలో పలు నిర్ణయాలు

రాష్ట్రంలో లాక్‌ ‌డౌన్‌ను జూన్‌ 10 ‌నుంచి మరో పదిరోజుల పాటు అంటే పొడిగించాలని రాష్ట్ర కేబినెట్‌ ‌నిర్ణయించింది. ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన మంగళవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 6 గంటలనుంచి సాయంత్రం 5 గంటల దాకా లాక్‌ ‌డౌన్‌ ‌సడలించాలని, సాయంత్రం 5 గంటలనుంచి 6 గంటల వరకు అంటే మరో గంటపాటు తిరిగి ఎవరి గమ్యస్థానాలకు వారు చేరుకునేందుకు వెసులు బాటు కల్పించాలని కేబినెట్‌ ‌నిర్ణయించింది. సాయంత్రం ఆరు గంటల నుంచి మరుసటి ఉదయం ఆరు గంటల వరకు లాక్‌ ‌డౌన్‌ ‌నిబంధనలను కఠినంగా అమలు చేయాలని పోలీసుశాఖను కేబినెట్‌ ఆదేశించింది. ఈ నిర్ణయం 10వ తేదీనుంచి అమల్లోకి రానుంది. కాగా..కొరోనా పూర్తిగా అదుపులోకిరాని..సత్తుపల్లి, మధిర, నల్లగొండ, నాగార్జున సాగర్‌, ‌దేవరకొండ, మునుగోడు, మిర్యాల గూడ, నియోజక వర్గాల పరిధిలో మాత్రం, లాక్‌ ‌డౌన్‌ ఇప్పుడు కొనసాగుతున్న యథాతధ స్థితినే కొనసాగించాలని కేబినెట్‌ ‌నిర్ణయించింది. నేడు మాత్రం ఇంతకు ముందు ప్రకటించిన ప్రకారం యథాతథంగా మధ్యాహ్నం 2 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు లాక్‌ ‌డౌన్‌ ‌కొనసాగుతుంది.

ఇక కొత్త రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నవారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో రేషన్‌ ‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకొని, పెండింగులో ఉన్న 4,46,169 మంది అర్హులకు వెంటనే రేషన్‌ ‌కార్డులను మంజూరు చేయాలని కేబినెట్‌ ‌నిర్ణయించింది. 15 రోజుల్లోగా రేషన్‌ ‌కార్డులిచ్చే పక్రియను పూర్తి చేయాలని మంత్రిమండలి సంబంధిత అధికారులను ఆదేశించింది. రేషన్‌ ‌డీలర్ల కమీషన్‌, ‌తదితర సమస్యల పరిష్కారానికి మంత్రి గంగుల కమలాకర్‌ అధ్యక్షతన కేబినెట్‌ ‌సబ్‌ ‌కమిటీ ఏర్పాటు చేయాలని కేబినెట్‌ ‌నిర్ణయాంచింది. హైదరాబాద్‌ ‌మినహా రాష్ట్రంలోని 9 పాత జిల్లాలలో స్పెషల్‌ ‌ఫుడ్‌ ‌ప్రోసెసింగ్‌ ‌జోన్లు ఏర్పాటు చేయాలని, ఫుడ్‌ ‌ప్రోసెసింగ్‌ ‌పరిశ్రమల ఏర్పాటుకు వెంటనే చర్యలు ప్రారంభించాలని నిర్ణయించింది.

వానాకాలం పంటలకు రైతులను సంసిద్ధం చేయాలని కేబినెట్‌ ఆదేశించింది. అత్యుత్తమ వైద్య సేవలను అందుబాటులోకి తేవడానికి అధ్యయనంపై మంత్రి హరీష్‌ ‌రావు అధ్యక్షతన కేబినెట్‌ ‌సబ్‌ ‌కమిటీ ఏర్పాటు చేయాలని కేబినెట్‌ ‌నిర్ణయించింది. గత కేబినెట్‌ ‌సమావేశం చేసిన ఆదేశాలమేరకు సత్తుపల్లి, మధిర, నల్లగొండ, నాగార్జున సాగర్‌, ‌దేవరకొండ, మునుగోడు, మిర్యాలగూడ నియోజక వర్గాల్లో కరోనా పరిస్థితిని తెలుసుకునేందుకు రాష్ట్ర వైద్యాధికారుల బృందం పర్యటించింది. ఈ నియోజకవర్గాల్లో కరోనా ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదని, అందుచేత, ఈ ఏడు నియోజక వర్గాల్లో లాక్‌ ‌డౌన్‌ ‌ను ప్రస్థుతం కొనసాగిస్తున్న సమయాన్ని అనుసరించే మరో పదిరోజుల పాటు కొనసాగించాలని కేబినెట్‌ ‌కు వైద్యాధికారుల బృందం సిఫారసు చేసింది. వారి సిఫారసుల మేరకు పైనె తెలిపిన 7 నియోజకవర్గాల్లో లాక్‌ ‌డౌన్‌ ‌యధాతధ స్థితినే ( ఉదయం 6 గంటలనుంచి 1 గంట వరకు సడలింపు….మరో గంటపాటు గమ్యస్థానాలకు చేరుకునేందుకు వెసులుబాటు) కొనసాగించాలని కేబినెట్‌ ‌నిర్ణయించింది.

Leave a Reply