Take a fresh look at your lifestyle.

లాక్‌డౌన్ 10 రోజులు పొడిగింపు

ఉ .6 గం .ల నుండి మ .1 గం …సడలింపు 
హైదరాబాద్‌: తెలంగాణలో లాక్‌డౌన్ మ‌రో 10 రోజులు పొడిగిస్తూ రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గతంలో తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్రంలో నేటితో లాక్‌డౌన్‌ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో సమావేశమైన కేబినెట్‌.. మళ్లీ జూన్ 10 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.  అయితే సడలింపు సమయాన్నిమూడు గంటలు పెంచింది. ఇప్పటి వరకు ఉదయం 6 నుంచి 10 గంటల వరకే సడలింపు ఇస్తుండగా.. దాన్ని మ‌ధ్యాహ్నం 1 గంట వరకు పొడిగించారు.

Leave a Reply