Take a fresh look at your lifestyle.

స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ ‌విడుదల

  • 23 వరకు నామినేషన్ల స్వీకరణ..24న పరిశీలన..26న ఉపసంహరణ
  • డిసెంబర్‌ 10‌న పోలింగ్‌..14‌న కౌంటింగ్‌

స్థానిక సంస్థల కోటాలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు నోటిఫికేషన్‌ ‌విడుదల చేసింది. మంగళవారం నుంచి ఈ నెల 23 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ నెల 24న ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్‌ 26. ‌డిసెంబర్‌ 10‌న పోలింగ్‌, ‌డిసెంబర్‌ 14‌న వోట్ల లెక్కింపు చేపట్టనున్నారు. తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆదిలాబాద్‌ ‌జిల్లాలో 1, వరంగల్‌ 1, ‌నల్లగొండ 1, మెదక్‌ 1, ‌నిజామాబాద్‌ 1, ‌ఖమ్మం 1, కరీంనగర్‌ 2, ‌మహబూబ్‌నగర్‌ 2, ‌రంగారెడ్డి జిల్లాలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ 12 స్థానాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీల పదవీకాలం 2022 జనవరి 4తో ముగియనున్నది. ఇందులో ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత కూడా ఉన్నారు. 

Leave a Reply