Take a fresh look at your lifestyle.

స్థానిక సంస్థలు ప్రతి నెల తప్పనిసరిగా.. విద్యుత్‌ ‌బిల్లులు చెలించాలి

సంబంధిత అధికారులతో సిఎస్‌ ‌సమీక్ష 

రాష్ట్రంలోని పంచాయతీలు, మున్సిపాలిటీలలో పెండింగ్‌ ‌విద్యుత్‌ ‌బిల్లుల అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సోమేష్‌ ‌కుమార్‌ ‌శుక్రవారం బిఆర్‌కెఆర్‌ ‌భవన్‌లో సంబంధిత ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎస్‌ ‌మాట్లాడుతూ పెండింగ్‌ ‌విద్యుత్‌ ‌బిల్లుల అంశంలో ముఖ్యమంత్రి  కె.చంద్ర శేఖర్‌ ‌రావు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు ప్రతి నెల తప్పనిసరిగా విద్యుత్‌ ‌బిల్లులను చెల్లించాలని, చెల్లించని పక్షంలో తగు చర్యలు తీసుకోబడుతాయని స్పష్టంచేశారు. పెండింగ్‌ ‌విద్యుత్‌ ‌బకాయిల అంశంపై నిర్ణయాన్ని త్వరలో తీసుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల నుండి డిస్కంలకు రావాల్సిన బకాయిలపై గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలతో చేర్చించి ఒక వారంలోపులో సమగ్ర నివేదిక రూపోందించాలని ఆయన ఆదేశించారు.

త్వరలో స్థానిక సంస్థలలో పేరుకపోయిన పెండింగ్‌ ‌విద్యుత్‌ ‌బకాయిలపై ముఖ్యమంత్రి త్వరలో విధానపరమైన నిర్ణయాన్ని తీసుకుంటారని, సంబంధిత శాఖ అధికారులు పూర్తి వివరాలతో నివేదికను రూపొందించాలని సూచించారు. పనిచేయని బోరుబావులకు సంబంధించిన విద్యుత్‌ ‌బిల్లులు తదితర అంశాలపై గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటిలు, డిస్కం అధికారులు సంయిక్త బృందాలను తక్షణమే ఏర్పాటు చేసి పెండింగ్‌ అం‌శాలపై పరిష్కరించాలని అన్నారు. కరెంట్‌ ‌మీటర్‌ ‌రీడింగ్‌ ‌ప్రాతిపదికనే చార్జిలను వసూలు చేయాలని, నూటికి నూరు శాతం సమగ్ర వివరాలు ఉండాలని ఆదేశించారు. ఒక నెల లోపలో అవసరమైన చోట విద్యుత్‌ ‌మీటర్లను బిగించాలని సూచించారు. ఈ సమావేశంలో పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌ ‌కుమార్‌, ‌కార్యదర్శి సుదర్శన్‌ ‌రెడ్డి, కమిషనర్‌  ‌సత్యనారాయణ, పంచాయతీ రాజ్‌ ‌శాఖ కార్యదర్శి సందీప్‌ ‌కుమార్‌ ‌సుల్తానియా, పంచాయతీ రాజ్‌ ‌శాఖ కమిషనర్‌  ‌రఘునందన్‌ ‌రావు, డిస్కం సి.యం.డి లు రఘుమా రెడ్డి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply