Take a fresh look at your lifestyle.

రుణమాఫీ ఖాతాలను వెంటనే అందజేయాలి

వనపర్తి,మే,13(ప్రజాతంత్ర విలేకరి) : రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ పథకం కింద అర్హులైన రైతుల జాబితాను సాధ్యమైనంత తొందరగా రూపొందించి సమర్పించాలని జిల్లా కలెక్టర్‌ ‌షేక్‌యాస్మిన్‌ ‌బాష బ్యాంకర్లను ఆదేశించారు. బుధవారం ఆమె తన ఛాంబర్లో రుణమాఫీ పథకం పై అదనపు కలెక్టర్‌ ‌డి.వేణుగోపాల్‌ ‌తో కలిసి లీడ్‌ ‌బ్యాంకు మేనేజర్‌ ‌సురేష్‌ ‌కుమార్‌, ‌జిల్లా వ్యవసాయ అధికారి సుధాకర్‌రెడ్డి లతో సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం పంట రుణాలు పొందిన రైతులకు సంబంధించి 25000 రూపాయల లోపు రుణాలు పొందిన అర్హులైన రైతుల రుణాలను ఒకేసారి నేరుగా రైతు లోన్‌ అకౌంట్లో ఆన్‌లైన్‌ ‌ద్వారా వేయటం జరుగుతుందని కలెక్టర్‌ ‌తెలిపారు. లక్ష రూపాయల లోపు రుణం పొందిన రైతుల రుణాలను నాలుగు విడతల్లోమాఫీ చేసేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే.

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు కూడా డారీ చేసింది. రైతుల ఆధార్‌ ‌డేటా ఆధారంగా రుణమాఫీ చేయనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి వనపర్తి జిల్లాలో 25000 రూపాయల లోపు రుణాలు పొందిన రైతుల జాబితా లక్ష రూపాయల లోపు రుణాలు పొందిన రైతుల జాబితా వేర్వేరుగా తయారు చేసి వెంటనే సమర్పించాలని ఆమె ఆదేశించారు. ఈ డేటా ను వ్యవసాయశాఖ పోర్టల్‌ ‌లో పొందుపరచటం జరుగుతుందని, దీని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం నేరుగా రైతు లోన్‌ అకౌంట్‌ ‌కి అమౌంట్‌ ‌వేయడం జరుగుతుందని ఆమె స్పష్టం చేషారు. ఈ సమావేశానికి వ్యవసాయ అధికారి రవికుమార్‌ ‌హాజరయ్యారు.

Leave a Reply